చీకటిపై వెలుగు, చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకొనే దీపావళి అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరారు ఏపీ సీఎం జగన్. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పారు.
తెలంగాణ గవర్నర్ కూడా తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుగులో చెప్పారు.
తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కూడా ప్రజలకు దివాళీ శుభాకాంక్షలు చెప్పారు. ఓ శ్లోకాన్ని పోస్ట్ చేశారు.
జీవితంలో ధైర్యమనే దీపాన్ని, కృషి అనే నూనెతో వెలిగించి జీవితంలో ఉన్న చీకట్లు తొలగించుకోవాలని ప్రజలకు చెబుతూ దీపావళి పండగా అందరిలోనూ కొత్త కాంతులు నింపాలని ఆకాంక్షించారు.