హిందీ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) కు జోడీగా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha) నటిస్తున్న వెబ్ సిరీస్ 'సిటాడెల్' (Citadel Web Series). అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందుతోన్న ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్ ప్రాజెక్ట్ ఇది. దీనికి రాజ్ అండ్ డీకే షో రన్నర్స్ & డైరెక్టర్స్. 'సిటాడెల్'లో సమంత ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేశారు. ఆమె లుక్ చూస్తుంటే లేడీ జేమ్స్ బాండ్ టైపులో ఉందని ఫ్యాన్స్ కొందరు కామెంట్ చేస్తున్నారు.
 
'ఫ్యామిలీ మ్యాన్ 2' తర్వాత...
రాజ్ అండ్ డీకే తీసిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో సమంత నటించారు. ఆమెకు ఆ సిరీస్ దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చింది. ఆ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ విజయం తర్వాత 'సిటాడెల్'తో వాళ్ళ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. 


ఆల్రెడీ 'సిటాడెల్' వెబ్ సిరీస్ కోసం సమంత రూత్ ప్రభు కొన్ని రోజుల క్రితం ముంబై చేరుకున్నారు. ఇండియాలో షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక సౌత్ ఆఫ్రికా, సైబీరియాలో కూడా షూటింగ్ చేయనున్నారు. 
ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ ప్రొడ్యూసర్ చేసిన 'సిటాడెల్'కు ఇది ఇండియన్ వెర్షన్. అమెరికన్ వెర్షన్ ప్రియాంకా చోప్రా చేయగా... ఇండియాలో సామ్ చేస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్ గూఢచారిగా కనిపించనున్నారు. ప్రాజెక్ట్ ఆఫర్ రాగానే ఓకే చేశానని సమంత తెలిపారు. 


Also Read : స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?






సినిమాలకు వస్తే....
త్వరలో 'ఖుషి' షురూ!
సమంత (Samantha) ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఎప్పటి నుంచి మళ్ళీ షూటింగ్స్ స్టార్ట్ చేస్తారు? తెలుసుకోవాలని కొన్ని రోజుల క్రితం వరకు ఆమె అభిమానులతో పాటు పరిశ్రమ ప్రముఖులు కూడా చూశారు. ఆ అవసరం ఇప్పుడు లేదు! ఎందుకు అంటే... సమంత సెట్స్‌కు వెళ్ళారు. 'సిటాడెల్' షూటింగ్ స్టార్ట్ చేయడంతో 'ఖుషి'ని పక్కన పెట్టి ఆ వెబ్ సిరీస్ చేస్తున్నారా? అనే అనుమానాలు మొదలు అయ్యాయి. విజయ్ దేవరకొండ సినిమాకు డేట్స్ ఇవ్వడం లేదనే పుకార్లు చక్కర్లు కొట్టాయి.


మార్చి తొలి వారానికి కూడా 'ఖుషి' సెట్స్‌కు సమంత రాకపోతే మరో సినిమా చేయాలని దర్శకుడు శివ నిర్వాణ ఆలోచిస్తున్నారని వార్తలు వచ్చాయి. వాటిని ఆయన ఖండించారు. ''అతి త్వరలో 'ఖుషి' రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రతిదీ అందంగా ఉండబోతుంది'' అని ఆయన పేర్కొన్నారు. దాంతో పుకార్లకు చెక్ పడింది. 


'శాకుంతలం' వాయిదా!?
'ఖుషి' కంటే ముందు పాన్ ఇండియా సినిమా 'శాకుంతలం' చిత్రీకరణను సమంత పూర్తి చేశారు. దానిని ఫిబ్రవరి 17న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, ఆ తేదీకి సినిమా రావడం లేదని, వాయిదా వేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. దర్శక నిర్మాతలు గుణశేఖర్, 'దిల్' రాజు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కొన్ని రోజుల క్రితం సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమాలో సమంత జోడీగా మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకే రోజు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


Also Read : ఎవరీ ఆషిక? నందమూరి నయా నాయిక గురించి ఆసక్తికరమైన విషయాలు...