Samantha: టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘శాకుంతలం’ సినిమాపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాను కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంను ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు. ఇందులో లేడీ సూపర్ స్టార్ సమంత శకుంతల పాత్రలో కనిపించింది. భారీ అంచనాల మధ్య  ఈ సినిమాను ఏప్రిల్ 14 న విడుదల చేశారు మేకర్స్. విడుదల అయిన మొదటిరోజు నుంచే మూవీపై మిశ్రమ స్పందన రావడంతో అది కలెక్షన్లపై ప్రభావం చూపింది. అయితే ‘శాకుంతలం’ సినిమాపై తాజాగా బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు సంచలన ట్వీట్ చేశారు. ‘శాకుంతలం’ సినిమా భారీ డిజాస్టర్ అంటూ ట్వీట్ చేశారు. అంతే కాదు ఇక సమంత కెరీర్ ముగిసిపోయింది అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. 


బాలీవుడ్ లో సినీ క్రిటిక్ గా పేరు తెచ్చుకున్న ఉమైర్ సంధు సంచలనాలకు కేరాఫ్ గా మారారు. ఆయన చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సినిమాలు రిలీజ్ అయినపుడు, అలాగే హీరో, హీరోయిన్ ల వ్యక్తిగత జీవితాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నటి సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమాపై ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. సినిమా విడుదలైన రోజే సమంతను విమర్శిస్తూ ట్వీట్ చేశారు ఉమైర్. సమంత సినిమా కెరీర్ ముగిసిపోయిందని, ఆమెకు ఈ సినిమాతో ఒక్క రోజులోనే క్రేజ్ తగ్గిపోయిందని ట్వీట్ చేశారు. మొదటిరోజు ‘శాకుంతలం’ డిజాస్టర్ గా నిలిచిందని రాసుకొచ్చారు. నిర్మాతలు భారీగా నష్టపోయారని, ఇప్పడు సమంత ఫ్లాప్ క్వీన్ అంటూ విమర్శించారు. తొలి రోజు సినిమా వసూళ్లు అవమానకరంగా ఉన్నాయి అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. 






సినిమా విడుదల అయిన రోజే కాకుండా తాజాగా మళ్లీ ఏప్రిల్ 16 న సమంతపై మరో ట్వీట్ చేశారు ఉమైర్ సంధు. ‘శాకుంతలం’ సినిమా రిజల్ట్ తో సమంత డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది అంటూ ఉమైర్ ట్వీట్ చేశారు. అంతే కాదు ఆమె ఫోన్‌ స్విఛ్ ఆఫ్ చేసేసింది అని పేర్కొన్నారు. ఇప్పటి వరూ సమంతకు ఉన్న క్రేజ్, బ్రాండ్ విలువ ఒక్క రోజుతో పడిపోయాయి అని రాసుకొచ్చారు ఉమైర్. ప్రస్తుతం ఉమైర్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ మూవీపై ట్రోల్స్ వస్తున్నాయి. ఇక ‘శాకుంతలం’ సినిమాలో కథ బలంగా ఉన్నా దాన్ని సరైన స్క్రీన్ ప్లే లేదని, సినిమా అంతా ఏదో సీరియల్‌లా సాగదీశారు అనే కామెంట్లు వస్తున్నాయి. అంతే కాకుండా సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ పై కూడా నెగిటివ్ కామెంట్లు రావడంతో మూవీ కలెక్షన్లపై ప్రభావం చూపుతోంది. వీకెండ్ లో కూడా మూవీ అనుకున్నంతగా వసూళ్లను సాధించలేకపోవడంతో మూవీటీమ్ పై నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. గతంలో సమంత చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు బాగానే ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉమైర్ సంధు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. మరి దీనిపై మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. 


Read Also: ప్రముఖ గాయకుడు మనోకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసిన రిచ్‌మండ్ గాబ్రియేల్ యూనివర్శిటీ