హనీ సింగ్, భారతీయ సినీ సంగీత అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. ఆయన రూపొందించిన ఎన్నో పాటలు చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరినీ ఓ ఊపు ఊపాయి. తాజాగా ఆయన షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’లోని లుంగీ డ్యాన్స్ పాట గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
లుంగీ డ్యాన్స్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన హనీ సింగ్
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె హీరో, హీరోయిన్లుగా ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలోని లుంగీ డ్యాన్స్ అనే పాటకు హనీ సింగ్ షారుఖ్ తో కలిసి పనిచేశారు. ఈ పాట అప్పట్లో చార్ట్ బస్టర్ గా నిలిచింది. అన్ని వయసుల వారిని ఓ ఊపు ఊపింది. ఇప్పటికీ యూట్యూబ్ లో ఎక్కువ మంది చూసిన పాటల లిస్టులో ఈ పాట తప్పకుండా ఉంటుంది. అంతేకాదు, చాలా వేడుకల్లో ఇప్పటికీ ఈ పాటను ప్లే చేస్తారు. ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హనీ సింగ్ ఈ పాట గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
షారుఖ్ భాయ్ కి లుంగీ డ్యాన్స్ పాట నచ్చలేదు- హనీ సింగ్
“వాస్తవానికి నాకు బాలీవుడ్ సినిమాలకు సంగీతం అందించడం పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే బాలీవుడ్ కు మ్యూజిక్ ఇచ్చిన ప్రతిసారి ఏదో ఒకరకంగా ఇబ్బంది పడ్డాను. ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమా కోసం ఒక పాట చేయడానికి షారూఖ్ భాయ్ నన్ను పిలిచారు. అతడు 'అంగ్రేజీ బీట్' లాంటిది చేయమని చెప్పాడు. ఎందుకలా అని అడిగాను. ఆ పాట చాలా పెద్ద హిట్ కావడంతో అలాంటివి చేయనని చెప్తున్నానని అన్నాను. నేను అలాంటి పాటను చేయనని చెప్పాను. కానీ, అదిరిపోయే సాంగ్ మాత్రం చేయగలనని తెలిపారు. ఆ తర్వాత నేను చేసిన సాంగ్ ‘లుంగీ డ్యాన్స్’. కానీ, ఈ పాట షారుఖ్‌కు పెద్దగా నచ్చలేదు. తనకు ఆ పాట కావాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోవడానికి ఏకంగా మూడు వారాల సమయం తీసుకున్నారు. ఆ తర్వాత ఓకే చేశారు. ఆ పాట ఏ రేంజిలో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే” అన్నారు.
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ వరుస సినిమాలతో బిజీ అయ్యారు. తాజాగా ‘పఠాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం అట్లీ దర్శకత్వం ‘జవాన్’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ చిత్రంలో నయనతార, సునీల్ గ్రోవర్, సన్యా మల్హోత్రా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అటు రాజ్‌కుమార్ హిరానీతో కలిసి ‘డుంకీ’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రం 2023 క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.
Read Also: ప్రముఖ గాయకుడు మనోకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసిన రిచ్‌మండ్ గాబ్రియేల్ యూనివర్శిటీ