ర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్ట్మాత్మక పాన్ ఇండియా మూవీ `RRR`పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రంలో అద్భుత నటన కనబర్చిన జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ను ఓ రేంజిలో మెచ్చుకుంటున్నారు. తప్పకుండా ఆస్కార్ అవార్డును అందుకుంటారంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


`RRR`పై ఆస్కార్ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్


తాజాగా హాలీవుడ్ నటి, ఆస్కార్ విన్నర్ జెస్సికా చస్టెయిన్ `RRR`పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినిమా చూస్తున్నంత సేపు  పార్టీలో ఎంజాయ్ చేసిన ఫీలింగ్ కలిగిందన్నారు. ఈ సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు. `ది ఐస్ ఆఫ్ టమ్మీ’  అనే సినిమాకు గానూ జెస్సీకా గత ఏడాది ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఈమె ఆస్కార్ అకాడమీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో తన కామెంట్స్ సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి. అటు జెస్సికా ట్వీట్‌పై `RRR` కృతజ్ఞతలు తెలిపింది.










రాం చరణ్ పై ఫ్రాన్సెస్ ఫిషర్ ప్రశంసలు


ఇటీవలే `టైటానిక్` ఫేమ్ ఫ్రాన్సెస్ ఫిషర్ సైతం `RRR` సినిమాలో రామ్ చరణ్ నటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ యాటిట్యూడ్, అతను చేసిన స్టంట్స్, డ్యాన్స్, సాంగ్స్, అన్నింటికీ మించి తను నటించిన సన్నివేశాలు సూపర్బ్ గా ఉన్నాయని వెల్లడించారు. ఈ సినిమా ఆస్కార్ అందుకోవాలని ఆకాంక్షించారు.


ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపిన `RRR`


రాజమౌళి దర్శకత్వంలో జూ. ఎన్టీఆర్, రాంచరణ్ నటించిన ఈ సినిమా భారత్ లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా అద్భుత ఆదరణ దక్కించుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. జపాన్ లో ఈ సినిమా రికార్డుల మోత మోగించింది. స్వాంత్ర్య ఉద్యమం నాటి కథాంశంతో సాగే ఈ ఫిక్షనల్ యాక్షన్ డ్రామాలో జూ.ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, రామ్ చరణ్  అల్లూరి సీతారామ రాజుగా నటించి మెప్పించారు.


గోల్డెన్ గ్లోబ్స్ లో సత్తా, ఆస్కార్ బరిలో `RRR`


ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పలు వేదికలపై సత్తా చాటుతోంది. తాజాగా ఆస్కార్ బరిలోనూ నిలిచింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు రెండు విభాగాల్లో నామినేట్ అయ్యింది. ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డులకు చివరి నిమిషాల్ షార్ట్ లిస్ట్ అయ్యింది. `నాటు నాటు` సాంగ్  ఒరిజినల్ మ్యూజిక్ విభాగంలో అస్కార్ కోసం పోటీ పడుతోంది.  అటు ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాజమౌళిని పలు అవార్డులు వరిస్తున్నాయి.  


Read Also: అప్పుడు ఫైటింగ్, ఇప్పుడు మీటింగ్, చిరంజీవి గురించి అడవి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్