Roti Kapada Romance Movie: తెలుగు సినిమా పరిశ్రమ నుంచి మరో రొమాంటిక్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రోటి కపడా రొమాన్స్’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ‘హుషారు’, ‘సినిమా చూపిస్త మావ’, ‘మేం వయసుకు వచ్చాం, ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘పాగల్’ లాంటి యూత్ ఫుల్ సినిమాలను నిర్మించిన బెక్కెం వేణుగోపాల్ ప్రొడ్యూస్ చేశారు. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నవంబరు 22న విడుదల కానుంది. అయితే... ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
‘రోటి కపడా రొమాన్స్’ మూవీ ఎలా ఉందంటే?
‘రోటి కపడా రొమాన్స్’ సినిమా స్పెషల్ షో జరిగింది. కొంత మంది జర్నలిస్టులు, ఇండస్ట్రీ జనాలు చూశారు. అందులో ఒకరు రాజేష్ కుమార్ రెడ్డి. ఆయన ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. తాజాగా ఈ సినిమా చూసినట్లు చెప్పిన ఆయన... యువతను బాగా ఆకట్టుకునేలా ఉందన్నారు. “రోటి కపడా రొమాన్స్’ సినిమాలోని చక్కటి కంటెంట్, ఎమమోషనల్ డెప్త్ యువతను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా నిజ జీవిత అనుభవాలు, భావోద్వేగాలకు అద్దం పట్టేలా ఉంది. సినిమాలోని ప్రతి మూవ్ మెంట్ యువతను అట్రాక్ట్ చేస్తుంది” అని చెప్పుకొచ్చారు. ఈ రివ్యూతో సినిమాపై ప్రేక్షకులలో పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి.
ప్రేక్షకులను ఆకట్టుకున్న ట్రైలర్
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. 2 నిమిషాల 48 సెకెన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం రొమాంటిక్ గా ఆకట్టుకుంది. ట్రైలర్ లో వచ్చే డైలాగ్స్ యూత్ ను అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. యూత్ కు నచ్చేలా అదిరిపోయే రొమాంటిక్ సన్నివేశాలతో నిండి ఉంది. ఈ ట్రైలర్ “అర్జున్ రెడ్డి సాంగ్ పెట్టవా ప్లీజ్..” అంటూ హీరోయిన్ ఇచ్చే హింట్ యువతను బాగా ఆకట్టుకుంది. హ్యాపీగా ఉన్న లైఫ్ లోకి అమ్మాయిలు వచ్చి ఇంటర్ స్టెల్లార్ సినిమా చూపించి వెళ్తారంటూ అబ్బాయిలు చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. మొత్తంగా ఈ ట్రైలర్ చూస్తుంటే, ప్రస్తుత రోజుల్లో యువతకు తగినట్లుగా రొమాన్స్, కామెడీ, లవ్, బ్రేకప్ లాంటి ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది. ఈ మూవీ ట్రైలర్ కు ఇప్పటికే మాంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది.
అటు ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని నేచురల్ స్టార్ నాని చెప్పారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న మాట్లాడిన ఆయన.. యువతకు నచ్చే అంశాలతో పాటు కుటుంబానికి సంబంధించిన ఎమోషన్స్ ను మిక్స్ చేసి తెరకెక్కించిన ఈ సినిమా కచ్చితంగా హిట్ కొడుతుందన్నారు. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర యువతకు కనెక్ట్ అవుతుందన్నారు.
Read Also: వేణు ఉడుగుల నిర్మాణంలో మట్టి పరిమళాల కురిపించే ప్రేమ కథ... తండేల్ వచ్చిన వెంటనే థియేటర్లలోకి