Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today November 20th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మత్తు మందు కలిపిన పాలు ఇచ్చి లక్ష్మీని పడుకోపెట్టేసిన మనీషా.. మిత్ర దగ్గర చాడీలు!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మత్తు మందు కలిపిన పాలు తాగి లక్ష్మీ లేవకపోవడంతో మిత్ర లక్ష్మీ మీద అసహనం వ్యక్తం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేస్తూ మిత్ర, లక్ష్మీ, పిల్లలు అందరూ సంతోషంగా ఉండటం చూసి మనీషా, దేవయానిలు రగిలిపోతారు. వాళ్ల సంతోషం చూసి ముద్దు దిగలేదు అని దేవయాని అంటుంది. దానికి మనీషా మీకే అలా ఉంటే వాళ్లు భార్య, పిల్లలు కుటుంబం రక్త సంబంధం అని మాట్లాడుతుంటే నాకు ఇంకా ఎలా ఉందో అర్థం చేసుకోండి అని మనీషా అంటుంది. 

Continues below advertisement

దేవయాని: మిత్ర లక్ష్మీని గుడికి తీసుకెళ్లాలి అనుకున్నాడట ఆ రకంగా నీ కథని మిత్ర కంచికి తీసుకెళ్లాలి అనుకున్నాడన్నమాట. ఈ రోజు గుడి అన్నాడు రేపు తాజ్ మహాల్ అంటాడు. మిత్ర నిన్ను మర్చిపోయి లక్ష్మీకి దగ్గరవుతున్నాడు. గుడిలో మిత్ర, లక్ష్మీలు భార్యభర్తలుగా పూజలు చేస్తారు. నువ్వు చూస్తూ ఉండటం తప్ప ఏం చేయలేవు. మిత్ర, లక్ష్మీలు దగ్గరవకుండా ఫుల్‌స్టాప్ పెట్టు అప్పుడే నువ్వు మిత్రకు దగ్గరవుతావు అంత కంటే ముందు లక్ష్మీ గుడికి రాకుండా ఆపు.

ఇంతలో లక్ష్మీ పాలు తీసుకొని లక్కీ గదికి వెళ్లడం మనీషా చూస్తుంది. ఐడియా వచ్చేసిందని మనీషా అంటుంది. రేపు లక్ష్మీ మిత్ర గుడికి వెళ్లకుండా ఆపుతానని అంటుంది. కిచెన్‌కి వెళ్లి పాలు మరిగిస్తుంది. అవి లక్ష్మీ కోసం అని చెప్పి వాటిలో మత్తు మందు కలిపి లక్ష్మీకి తాగిస్తే రేపు సాయంత్రం వరకు లేవదని అంటుంది. ఇక ఆ పాలను లక్ష్మీతో తాగించాలని చెప్పి జానుకి ఆ పాలు ఇచ్చి లక్కీకి ఇవ్వమని చెప్పమని చెప్తుంది. ఇప్పటికే లక్కీ పాలు తాగేయడంతో వాటిని లక్ష్మీ తాగి పడుకుంటుందని చెప్తుంది.

ఇక దేవయాని జానుని పిలిచి పాలు లక్కీకి ఇవ్వమని చెప్తుంది. జాను పాలు తీసుకొని వెళ్తుంది. లక్ష్మీ తాను తీసుకెళ్లిన పాలు లక్కీకి తాగిస్తుంది. ఇక జాను ఆ పాలను ఇస్తే లక్కీ అప్పటికే తాగేశానని అంటుంది. ఇక లక్ష్మీ ఆ పాలను జానుకి తాగమంటే నా వల్ల కాదని జాను అంటుంది. దాంతో లక్కీ లక్ష్మీతో నాకు రక్తం ఇచ్చి నువ్వు వీక్ అయ్యావ్ అమ్మా నువ్వు తాగు అని అంటుంది. జాను కూడా తాగమని అనడంతో లక్ష్మీ మత్తు మందు కలిపిన పాలు తాగేస్తుంది. అదంతా దేవయాని చూసి లక్ష్మీ పాలు తాగేసిందని అంటుంది. రేపు  లక్ష్మీ గుడికి రాదని మనీషా, దేవయాని ఇద్దరూ తెగ సంతోష పడతారు. 

ఉదయం అందరూ గుడికి వెళ్లాలని రెడీ అవుతారు. వివేక్ జాను దగ్గరకు వెళ్లి ముద్దు మురిపాలు అంటే జాను చిరాకు పడుతుంది. పెళ్లానికి మల్లెపూలు తీసుకురాలేవు కానీ ఇలా ముద్దు మురిపాలు అంటావ్ అంటుంది. ఇక వివేక్ జానుని దగ్గరకు తీసుకోవడానికి వస్తే అప్పుడే దేవయాని వచ్చి వివేక్‌ని పంపేస్తుంది. జానుతో మగాడికి బుద్ధిలేదు నీకు కూడా నీకు లేదా అంటే తను నా భర్త ఇది నా గది అని జాను రెచ్చిపోతుంది. మిత్ర, మనీషా అందరూ రెడీ అయి హాల్‌లోకి వస్తారు. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. లక్ష్మీ మాత్రం రాకపోవడంతో మిత్ర లక్ష్మీ కోసం చూస్తాడు. ఇక లక్కీ రెడీ అవ్వకుండా లక్ష్మీని లేపుతుంది.

ఇక జున్ను వచ్చి ఏంటి లక్కీ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు అంటే అమ్మ లేవలేదు అని లక్కీ చెప్తుంది. పిల్లలు ఇద్దరూ వచ్చి మిత్ర వాళ్లతో విషయం చెప్తారు. దేవయాని, మనీషాలు లక్ష్మీని మిత్ర ముందు నానా మాటలు అంటారు. ఇక మనీషా లక్కీని రెడీ చేస్తాను అని తీసుకెళ్తుంది. జాను, వివేక్‌లు ఎంత లేపినా లక్ష్మీ లేవదు దాంతో వివేక్ వదినని పడుకోనివ్వు మనం వెళ్దామని అంటాడు. ఇంతలో మనీషా లక్కీని చక్కగా రెడీ చేసి తీసుకొస్తుంది. వదినకు హెల్త్ బాలేక నిద్ర పోతుందని వివేక్ చెప్తాడు. లక్ష్మీ కావాలనే ఇలా చేస్తుందని మనీషా అంటుంది. లక్ష్మీ ఎప్పుడూ నువ్వు చెప్పింది వినదని దేవయాని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: సత్యభామ సీరియల్: కంగారు పెట్టించి చక్రవర్తి నిజం ఒప్పుకునేలా చేసిన సత్య.. క్రిష్‌, చక్రిలను కలుపుతుందా!

Continues below advertisement