ఒక సినిమాకి టాక్ అనేది చాలా ముఖ్యం. పాజిటివ్ టాక్ వస్తేనే కలెక్షన్స్ వస్తాయి. టాక్ ఏ మాత్రం బాగోకపోయినా.. జనాలు లైట్ తీసేసుకుంటారు. ఓటీటీలోనో.. టీవీలోనో చూసుకుందామని గమ్మునుంటారు. రిలీజ్ డే టాక్ అనేది వసూళ్ళలో కీలకపాత్ర పోషిస్తుంటుంది. సినిమాపై నమ్మకం ఉన్నవాళ్లు మాత్రమే ప్రీమియర్ షోలతో కాస్త హడావిడి  చేస్తుంటారు. అది కూడా ఒకరోజు ముందుగా సెలబ్రిటీలకు, మీడియాకు ప్రీమియర్స్ వేసి సినిమాను చూపిస్తుంటారు. 

 


 

అయితే దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రం ఏకంగా రెండు రోజులు ముందుగానే ప్రీమియర్ షోకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పూరి తనయుడు ఆకాష్ పూరి 'రొమాంటిక్' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మొదలుపెట్టి రెండేళ్లకు పైగా అవుతోంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాకి పూరి క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే కూడా అందించారు. పూరి శిష్యుడు అనిల్ పాదూరి డైరెక్టర్ గా వ్యవహరించారు. 

 

ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే రెండు రోజులు ముందుగానే అంటే ఈ నెల 27న 'రొమాంటిక్' స్పెషల్ ప్రీమియర్స్ పడబోతున్నాయి. హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో బుధవారం రాత్రి 8 గంటలకు ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ జరగబోతుంది. ఈ షోకి టాలీవుడ్ సెలబ్రిటీలంతా హాజరు కాబోతున్నారు. ఈ షో కాకుండా మీడియాకు మరో షో వేస్తారట. 

 

రెండు రోజులు ముందుగానే సినిమాను చూపించడమంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యేలోపు టాక్ ప్రపంచమంతా పాకేస్తుంది. ఈ టాక్ ని బట్టి సినిమా చూడాలో వద్దో..? అనేది డిసైడ్ చేసుకుంటారు. ఈ సినిమాతో పాటు అదే రోజున నాగశౌర్య నటించిన 'వరుడు కావలెను' కూడా రిలీజ్ కాబోతుంది. ఈ రెండు సినిమాల మధ్య పోటీ నెలకొంది. ఇలాంటి సమయంలో ప్రీమియర్స్ వేయడమంటే పూరి ధైర్యమేంటో మరి!


Also Read: బిగ్ బాస్ ఎమోషనల్ గేమ్.. తట్టుకోలేక ఏడ్చేసిన హౌస్ మేట్స్..


Also Read: ప్రభాస్-పూజాహెగ్డేల మధ్య గొడవ.. నిజమేనట..


Also Read: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి


Also Read: ఆ విషయంలో బాధగా ఉందంటున్న రజనీకాంత్


Also Read: సంక్రాంతి రేస్ నుంచి మహేష్, పవన్ ఔట్.. కొత్త రిలీజ్ డేట్లు ఇవేనా..?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి