హిందీలో తెలుగు సినిమాలకు మార్కెట్ బావుంది. థియేటర్లలో విడుదలయ్యే సినిమాలను మాత్రమే కాదు... యూట్యూబ్, టీవీల్లో విడుదలయ్యే డబ్బింగ్ సినిమాలను కూడా బాగా ఉత్తరాది ప్రేక్షకులు బాగా చూస్తున్నారు. అందులోనూ రామ్ పోతినేని హిందీ డబ్బింగ్ సినిమాలకు వ్యూస్ బాగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజా సినిమా 'ది వారియర్' షూటింగ్ కంప్లీట్ కాకముందే... హిందీ రైట్స్ రూపంలో భారీ మొత్తం నిర్మాతకు అందింది.


ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న సినిమా 'ది వారియర్'. ఇందులో రామ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇటీవల ఆయన లుక్ విడుదల చేశారు. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ లుక్ విడుదల అయిన తర్వాత సినిమా హిందీ రైట్స్ 16 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలిసింది. రామ్ కెరీర్‌లో ఇది హయ్యెస్ట్, రికార్డ్ రేటు అని చెప్పాలి.






'ది వారియర్' కోసం రామ్ పోతినేని తొలిసారి ఖాకి చొక్కా వేసుకున్నారు. ఇందులో ఆయన సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. హిందీలో థియేటర్లలో విడుదల చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. 


Also Read: 'ఊ అంటావా మావ ఊఊ అంటావా' పాటకు మాధురీ దీక్షిత్ రీల్ చేస్తే... కన్ను కొట్టి రొమాన్స్ పండిస్తే?
Also Read: అల్లు అరవింద్‌కు రూ. 40 కోట్లు నష్టం... అల్లు అర్జున్ సినిమా హిందీ డబ్బింగ్ ఆపేయడానికి కారణం అదే!
Also Read: నా నవ్వు, బలం, ఆశ నువ్వే... కుమార్తె బ‌ర్త్‌డేకు ప్రగతి ఎమోషనల్ పోస్ట్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.