కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో అభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే బాధను తట్టుకోలేక ఒక అభిమాని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గడివద్దిరా అనే యువకుడు తన ఇంట్లో పునీత్ ఫొటోకు నివాళి అర్పించిన అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.


పునీత్ మరణంతో ఫ్యాన్స్ కొందరు గుండెపోటుతో మృతి చెందారు. పునీత్ రాజ్‌కుమార్ మరణానంతరం చాంరాజ్ నగర్ జిల్లాకు చెందిన మునియప్ప అనే 30 సంవత్సరాల వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని గ్రామస్తులు తెలిపారు.


బెళగావి ప్రాంతానికి చెందిన పరశురామ్ దేమణ్ణనవర్ అనే యువకుడు కూడా గుండెపోటుతో మృతి చెందాడు. పునీత్ మరణవార్త విన్నప్పటి నుంచి అతను ఏడుస్తూనే ఉన్నాడని తెలుస్తోంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు ఆయన గుండెపోటుతో మరణించారు.


ఉడుపి జిల్లాకు చెందిన సతీష్(35) అనే ఆటో డ్రైవర్ బాధలో ఆటోని గట్టిగా కొట్టాడు. దీంతో చేతికి పెద్ద గాయం అయి.. రక్తం కారడం మొదలైంది. ఇతను ఇప్పుడు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. పునీత్ రాజ్‌కుమార్‌ను తన ఫ్యాన్స్ ప్రేమగా అప్పు అని పిలుస్తారు.


లెజండరీ నటులు రాజ్‌కుమార్, పార్వతమ్మల చిన్న కొడుకే పునీత్ రాజ్‌కుమార్. ఇతను 29 కన్నడ సినిమాల్లో హీరోగా నటించారు. బాల్యనటుడిగా కెరీర్ ప్రారంభించిన పునీత్ రాజ్‌కుమార్, బెట్టడు హోవు అనే సినిమాకు జాతీయ బాల్యనటుడి అవార్డు కూడా పొందాడు. 


పునీత్ రాజ్‌కుమార్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు సెలబ్రిటీలు ట్వీటర్‌లో సంతాపం వ్యక్తం చేశారు. చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, మహేష్ బాబు వంటి తెలుగు స్టార్ హీరోలు కూడా పునీత్‌కు నివాళి తెలిపారు. ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ బెంగళూరు కూడా వెళ్లి పునీత్‌ను చివరి చూపు చూశారు.


Also Read: ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావ్! - పునీత్ మరణంపై అనుష్క స్పందన


Also Read: నోట మాట రాలేదు... పునీత్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి



Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. మోదీ ట్వీట్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి