టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనపై నగరి ఎమ్మెల్యే రోజా విమర్శలు చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి డ్రామాలు చేస్తున్నారని అని రోజా ఫైర్ అయ్యారు. కుప్పం నియోజకవర్గ ప్రజలకి హంద్రీ-నీవా ప్రాజెక్ట్ ద్వారా చంద్రబాబు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇవాళ జగన్ నీరు ఇవ్వలేదని విమర్శించడం సరికాదన్నారు. కుప్పంలో కనీసం ఇళ్లు కూడా లేని చంద్రబాబు.. కుప్పం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమాలను గాలికి వదిలేశారని ఆరోపించారు. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు టీడీపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. పట్టాభితో బూతు డ్రామాలు ఆడించి, కుప్పంలో బాంబు డ్రామా ఆడుతున్నారన్నారు. ఈ డ్రామాలను ప్రజలు ఎవ్వరూ నమ్మే పరిస్థితులు లేవన్నారు. కుప్పంలో ఏ ఎన్నికలు జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్టుగా ప్రజలు జగన్ మోహన్ రెడ్డికే పట్టం కడుతారని చంద్రబాబు ఇకనైనా గ్రహించాలన్నారు రోజా. టీడీపీ క్యాడర్ చేజారిపోతుందన్న భయంతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
Also Read: డబ్బుల కోసం ఓటర్ల ధర్నాలు ! ప్రజాస్వామ్యం పతనావస్థకు ఇదే సంకేతమా ?
చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబు ఎంత ఫ్రస్టేషన్‌లో ఉన్నారో అంతకన్నా ఎక్కువ ఫ్రస్టేషన్‌లో టీడీపీ నేతలు ఉన్నారని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శలు చేశారు. నగరి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎక్స్ అఫిషియో మెంబర్ హోదాలో ఎమ్మెల్యే ఆర్కే రోజా శనివారం పాల్గొన్నారు. అభివృద్ధి పనులపై మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపాదించిన తీర్మానాలను ఆమోదం తెలిపారు. ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రా.. లేక వీధి రౌడీనా?. యధా రాజా తథా చంద్రబాబు అనేది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు సరిపోతుందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
చంద్రబాబు డ్రామాలు ప్రజలు నమ్మట్లేదు
14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు, నమ్మి ఓటేసిన కుప్పం నియోజకవర్గ ప్రజలకి హంద్రీ నీవా ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు కూడా ఇవ్వలేదని రోజా అన్నారు. కుప్పంలో కనీసం ఇళ్లు, కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోకుండా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమాలను చంద్రబాబు గాలికి వదిలేశారు. ఇవాళ హడావుడిగా వచ్చి ప్రజలని ఓట్లు వేయమని అడగడం హాస్యాస్పదమని విమర్శించారు. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు టీడీపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయని ఎమ్మెల్యే రోజా ఉన్నారు. ఈ విషయాన్ని టీడీపీ గుర్తు చేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
Also Read: ప్రశాంతమైన కుప్పంలో రౌడీ రాజ్యం .. ఓటుతో బుద్ది చెప్పాలని చంద్రబాబు పిలుపు !