'ఈ పాట వచ్చి పదేళ్ళు అయ్యింది. అయినా పవర్ తగ్గలేదు' అని 'గబ్బర్ సింగ్' సినిమాలో ఓ డైలాగ్ ఉంది. ఆలీ చెబుతారు. అందులో ఏ పాట గురించి చెప్పారో గుర్తు ఉందిగా!? 'ఖుషి' సినిమాలోని 'ఏ మేరా జహాన్... ఏ మేరా ఘర్ మేరా ఆషియా' గురించి! ఈ రోజు... డిసెంబర్ 31, 2022న తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్స్ దగ్గర, అటు అమెరికాలోని కొన్ని స్క్రీన్స్ చూస్తే... పదేళ్ళు కాదు, ఆల్మోస్ట్ 22 ఏళ్ళ తర్వాత కూడా పవర్ తగ్గలేదని చెప్పాలి. 


పవన్ కళ్యాణ్ 'ఖుషి' రీ రిలీజ్...
థియేటర్స్ దగ్గర సందడే సందడి!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు అన్నిటిలో కంటే 'ఖుషి' (Kushi Movie) మూవీ వెరీ వెరీ స్పెషల్. కలెక్షన్స్ పరంగా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. ఇక, పవన్ కళ్యాణ్ నటన, ఫైట్లు, మణిశర్మ సంగీతం అందించిన పాటల గురించి మరీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సినిమాను మళ్ళీ థియేటర్లలో విడుదల చేశారు.


'ఖుషి' సినిమా వచ్చి 21 సంవత్సరాలు అయ్యింది. ఏప్రిల్ వస్తే... 22 ఏళ్ళు. కానీ, ఆ సినిమాకు ఉన్న క్రేజ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. పవన్ కళ్యాణ్ పవర్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే కొన్ని వందల సార్లు యూట్యూబ్, టీవీల్లో ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ చూసి ఉంటారు. కానీ, థియేటర్లలో చూస్తే... ఆ యుఫోరియానే వేరు. మణిశర్మ పాటలు, ఆ మ్యూజిక్, వింటేజ్ పవన్ కల్యాణ్ లుక్స్, భూమిక యాక్టింగ్, అలీ కామెడీ... వాట్ నాట్ సిద్ధూ, సిద్ధార్థ రాయ్... సిల్వర్ స్క్రీన్ మీద చూస్తే వచ్చే మజాయే వేరని ఫ్యాన్స్ చెబుతున్నారు.


Also Read : చేసుకుంటా, రాసి పెట్టిలేదు, క్లారిటీ లేదు - పెళ్ళిపై కన్‌ఫ్యూజ్‌ చేసిన ప్రభాస్
 
థియేటర్లలో ఈ రోజు 'ఖుషి' రీ రిలీజ్ అయితే... ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోతున్నారు. పవన్ ఇంట్రడక్షన్ సాంగ్ 'ఏ మేరా జహాన్...' కెకె వాయిస్‌లో వస్తుంటే...  అభిమానులు కూడా గొంతు కలిపారు. థియేటర్ల బయట అయితే ఏదైనా కొత్త సినిమా విడుదలైందా? అన్నట్లు సంబరాలు నెలకొన్నాయి. ఈ తరం పిల్లలకు, కొత్త తరం ప్రేక్షకులకు మళ్ళీ పవన్ కళ్యాణ్ పవర్ ఏంటనేది 'ఖుషి' రీ రిలీజ్ చూపించింది.
 
దేవిలో సినిమా చూసిన అకిరా నందన్
పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కూడా సినిమా చూశారు. అతడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దేవి థియేటర్‌కు వెళ్ళాడు. అయితే... ఎటువంటి హంగామా లేకుండా ముఖానికి మాస్క్, ఒక హుడీ టీ షర్ట్ వేసుకుని వెళ్ళాడు. కొందరు అభిమానులు అకిరాను గుర్తు పట్టారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.    






రీ రిలీజ్ సినిమాల్లో రికార్డ్
అడ్వాన్స్ బుకింగ్స్, థియేటర్ల దగ్గర హంగామా చూసిన ట్రేడ్ పండితులు ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమా కలెక్షన్స్ చూస్తే 'ఖుషి' రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం అని చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా 'ఖుషి' ఫీవర్ కనబడుతోంది. ఆ సినిమాతో తమకున్న నోస్టాల్జియాను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 'ఖుషి' కాలం నాటి టేప్ రికార్డర్స్, క్యాసెట్స్‌, పవన్ వాడిన గ్రీన్ హుడీస్ అన్నీ ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఎంతైనా పవర్ స్టార్ కదా ఆ రేంజ్ ఉంటుందిలే!


Also Read : 'కోరమీను' రివ్యూ : ఎవరి వలలో ఎవరు పడ్డారు? - ఆనంద్ రవి సినిమా ఎలా ఉందంటే?