ఆంధ్రప్రదేశ్‌లో  'గ్రూప్-1' పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 8న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏపీపీఎస్సీ డిసెంబరు 31న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. పరీక్షకు  దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 8న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 పరీక్ష కేంద్రాల్లో 'గ్రూప్-1' పరీక్ష నిర్వహణకు అధాకారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


గ్రూప్-1 పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


పరీక్ష కేంద్రాలకు సంబంధించిన వివరాలను జిల్లాలవారీగా ఏపీపీఎస్సీ కమిషన్ ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 పరీక్ష కేంద్రాల్లో 'గ్రూప్-1' పరీక్ష నిర్వహణకు అధాకారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యధికంగా విశాఖపట్నంలో 42 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా.. అత్యల్పంగా చిత్తూరులో 4 పరీక్ష కేంద్రాలను మాత్రమే ఏర్పాట్లు చేస్తున్నారు.  


పరీక్ష కేంద్రాల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


ప్రిలిమినరీ పరీక్ష విధానం: 
మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇది స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. 120 మార్కులకు పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.   ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 30 మార్కులు కేటాయించారు. అదేవిధంగా 120 మార్కులకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రెండు విభాగాలుంటాయి. ఒక్కో విభాగానికి 60 మార్కులు కేటాయించారు. 


మెయిన్ పరీక్ష పరీక్ష విధానం:
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మొత్తం 825 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 75 మార్కులు పర్సనాలిటీ టెస్టుకు కేటాయించారు. మిగతా మార్కులు 5 పేపర్లకు ఉంటాయి. 


➥ పేపర్-1 (జనరల్ ఎస్సే): 150 మార్కులు


➥ పేపర్-2 (హిస్టరీ & కల్చర్ & జియోగ్రఫీ ఇండియా/ఏపీ): 150 మార్కులు


➥ పేపర్-3 (పాలిటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్, లా & ఎథిక్స్): 150 మార్కులు 


➥ పేపర్-4 (ఎకానమీ & డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా/ఏపీ): 150 మార్కులు


➥ పేపర్-5 (సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్): 150 మార్కులు 


➥ తెలుగు, ఇంగ్లిష్ పరీక్షలు కూడా ఉంటాయి కాని, ఇవి క్వాలిఫైయింగ్ పేపర్లు మాత్రమే.


గ్రూప్-1 నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


పరీక్ష స్వరూపం, సిలబస్ వివరాలు...



Also Read: 


వెబ్‌సైట్‌లో 'గ్రూప్-1' ఓఎంఆర్ షీట్, క్వశ్చన్ పేపర్ బుక్‌లెట్ నమూనా పత్రాలు! అభ్యర్థులకు సూచనలివే!
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 8న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్న సంగతి. జనవరి 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు అధాకారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షకు సంబంధించిన హాల‌టికెట్లను డిసెంబరు 31 నుంచి ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.


'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష నేపథ్యంలో అభ్యర్థుల సౌలభ్యం కోసం ప్రశ్నప్రతం బుక్‌లెట్, ఓఎంఆర్ పత్రాల నమూనా పత్రాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో వాటిని అందుబాటులో ఉంచింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. పరీక్షపై అవగాహన కోసం ఈ నమూనా పత్రాలు ఉపయోగపడుతాయి. వాటిల్లో అభ్యర్థులు పరీక్షలో అనుసరించాల్సిన నిబంధనలను, ఇతర జాగ్రత్తలను క్షుణ్నంగా ఇచ్చారు. అభ్యర్థులు వాటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
ఓఎంఆర్ షీట్, క్వశ్చన్ పేపర్ బుక్‌లెట్ నమూనా పత్రాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...