సాధారణంగా ఏదైనా సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీలో రావాలంటే రెండు నెలలు సమయం పట్టేది. కానీ కొవిడ్ క్రైసిస్ కారణంగా నిర్మాతలు దీన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. రూల్స్ బ్రేక్ చేసుకుని ఓటీటీలతో ఒప్పందం చేసుకోవడంతో ఇండస్ట్రీలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. దీంతో విడుదలై 20 రోజుల్లోనే చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ మధ్యే వైల్డ్ డాగ్, జాతిరత్నాలు, ఉప్పెన, వకీల్ సాబ్ సినిమాలు తక్కువ సమయంలోనే ఓటీటీల్లోకి వచ్చేశాయి. విశ్వక్ సేన్ తాజా చిత్రం పాగల్ కూడా ఇప్పుడీ లిస్టులో చేరింది. సెప్టెంబర్ 3 నుంచి పాగల్ అందుబాటులోకి వస్తుందని సమాచారం.


విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన ‘పాగల్ ‘కి నరేశ్ కుప్పిలి దర్శకుడు. ఆగస్టు 14 న థియేటర్లలో విడుదలైంది. చిన్నప్పుడే తల్లి (భూమిక) చనిపోతుంది. తనని ప్రేమించే వాళ్లు లేక అనాథయిపోతాడు ప్రేం (విశ్వక్ సేన్). ఏ అమ్మాయైనా తనని ప్రేమిస్తే ఆమెను తల్లిలా చూసుకోవాలనుకుంటాడు. కనిపించిన ప్రతి అమ్మాయికి గులాబి పువ్వు ఇచ్చి ప్రేమిస్తావా అనడుగుతాడు. కొందరు లెంపకాయ కొట్టి వెళ్లిపోతారు, కొంతమంది నవ్వి ఊరుకుంటారు, కొందరు తమ బాయ్ ఫ్రెండ్స్ కి చెప్పి బెదరకొడతారు.  ఒకమ్మాయి  కనెక్టై బ్రేకప్ చెబుతుంది. మరొక అమ్మాయికి హీరోనే బ్రేకప్ చేబుతాడు. ఆ తర్వాత మురళీశర్మతో లవ్ ట్రాక్. అసలీ మురళీ శర్మ ఎవరు? లవ్వంటూ మన హీరో అతని వెంట ఎందుకు పడ్డాడు? ఈ ప్రశ్నలకి జవాబు సెకండాఫ్ లో ఉంటుంది. అక్కడొక అమ్మాయి తీర (నివేతా పెతురాజ్) రోడ్డు మీదున్న హీరోకి గట్టిగా అరిచి "ఐ లవ్యూ" చెబుతుంది. ఇంతకీ ఈ తీర ఎవరు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలన్నమాట. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కానుంది.


విశ్వ‌క్ సేన్ ప్ర‌స్తుతం గామి అనే ప్రాజెక్టుపై ఫోక‌స్ పెట్టాడు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉందీ చిత్రం. అడ్వెంచ‌ర‌స్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చాందినీ చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తోంది. లేహ్‌లోని ప‌లు ప్రాంతాల్లోషూటింగ్ జరిపారు. విశ్వ‌క్ సేన్ అఘోరా పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని స‌మాచారం.


Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘భిమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది, ఎప్పుడంటే..


Also Read:నిర్మాతగా తాప్సి.. తొలి సినిమా ‘బ్లర్’ షూటింగ్ పూర్తి, నైనిటాల్‌లో సంబరాలు


Also Read: నాలుగేళ్ల తర్వాత మళ్లీ హాలీవుడ్‌లోకి దీపిక..ఈసారి హీరోయిన్‌గా మాత్రమే కాదండోయ్..