'రాజుగారూ... మీ అమ్మాయి గారిని, అల్లుడు గారిని ఎవరో మర్డర్ చేశారండీ' - 'గాలివాన' ట్రైలర్‌లో మొదట వినిపించే డైలాగ్ ఇది. కొమ్మరాజు పాత్రలో డైలాగ్ కింగ్ సాయికుమార్, మరో ప్రధాన పాత్రలో రాధికా శరత్ కుమార్ నటించిన 'జీ 5' ఒరిజినల్ ఇది. చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, శరణ్య ప్రదీప్‌, అశ్రిత, అర్మాన్‌ మరియు నందిని రాయ్‌, తాగుబోతు రమేష్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


'గాలివాన' ట్రైలర్‌ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు. అది చూస్తే.. ఆద్యంతం ఆసక్తిగా సాగే సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అనిపిస్తోంది. ట్రైలర్ ప్రారంభంలో హత్య సన్నివేశాలు చూపించారు. హత్య చేసింది ఎవరనే సస్పెన్స్ ట్రైలర్ చివరి వరకూ కంటిన్యూ అయ్యింది. కుటుంబం అంతా కలిసి ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. 'వాడు నా కంటికి కనపడితే... వాడ్ని నా నుంచి దేవుడు కూడా కాపాడలేడు' అని రాధికా శరత్ కుమార్ చెప్పే ఎమోషనల్ డైలాగ్‌లో మొదటి పదం వీక్షకులకు షాక్ ఇస్తుంది. 'కచ్చితంగా మనలో ఒకరే ఈ పని చేశారు' అని చాందిని చౌదరి చెప్పే డైలాగ్ ఆసక్తి కలిగించేలా ఉంది.


Also Read: ఓలా క్యాబ్ ఎక్కిన హీరోయిన్, ఏసీ ఆపేసిన డ్రైవర్


బిబిసి స్టూడియోస్‌, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో 'జీ 5' ఓటీటీ సంస్థ నిర్మిస్తున్న ఒరిజినల్ సిరీస్ ఇది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు.  ఏప్రిల్ 14 నుంచి 'జీ 5' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.


Also Read: చిరంజీవి హీరోయిన్‌కు టోకరా, నాలుగు కోట్లు కొట్టేసిన కేటుగాడు!