Actress Rimi Sen Gets Cheated Of Over ₹ 4 Crore: మెగాస్టార్ చిరంజీవి సరసన 'అందరివాడు'లో ఓ కథానాయికగా నటించిన రిమీ సేన్ గుర్తు ఉన్నారా? ఆమెకు ఒకరు టోకరా వేశారు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపించడంతో 30 నుంచి 40 శాతం వడ్డీ ఇస్తానని చెప్పి న ఓ వ్యాపారవేత్త 4.14 కోట్ల రూపాయలు కొట్టేశారట. దాంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారామె. అసలు వివరాల్లోకి వెళితే...


ముంబైలోని ఖర్ (వెస్ట్) పోలీస్ స్టేషన్ లో మార్చి 29న రిమీ సేన్ ఓ కంప్లైంట్ చేశారు. అందులో తన అసలు పేరు శుభ మిత్ర సేన్ అని పేర్కొన్నారు. "నాకు 2019లో రౌనక్ జతిన్ వ్యాస్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. మా మధ్య స్నేహం పెరిగింది. తన కుటుంబం కొత్తగా స్టార్ట్ చేస్తున్న ఫోమింగో బీవరేజెస్ కంపెనీలో పెట్టుబడి పెడితే... 30 నుంచి 40 శాతం వడ్డీ ఇస్తానని చెప్పాడు. డబ్బులు ఇచ్చిన కొన్ని రోజులకు అతడు ఎటువంటి కంపెనీ స్టార్ట్ చేయడం లేదని తెలిసింది" అని రిమీ సేన్ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. తనను మోసం చేసిన రౌనక్ జతిన్ వ్యాస్ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.


Also Read: ఓలా క్యాబ్ ఎక్కిన హీరోయిన్, ఏసీ ఆపేసిన డ్రైవర్






'అందరివాడు' సినిమా తర్వాత తెలుగులో ఆమె మరో సినిమా చేయలేదు. కానీ, పదేళ్ల క్రితం వరకూ హిందీలో సినిమాలు చేశారు. 2011 తర్వాత రిమీ సేన్ నటనకు దూరంగా ఉన్నారు. అయితే... 2016లో 'బుధియా సింగ్ -  బోర్న్ టు రన్' సినిమాతో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  హిందీలో సూపర్ హిట్ సినిమా 'ధూమ్', 'ధూమ్ 2', కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన ఓ కథానాయికగా 'క్యూంకీ' సహా డజనుకు పైగా సినిమాల్లో రిమీ సేన్ నటించారు.  


Also Read: సన్నీ లియోన్‌తో ఇటువంటి చిత్రమా?