Vyooham Web Series Trailer: గత కొద్దికాలంగా వెబ్ సిరీస్ కు మంచి ఆదరణ లభిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు వెబ్ సిరీస్ లను చూస్తూ థ్రిల్ గా ఫీలవుతున్నారు. సరికొత్త కథలతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. పలు ఓటీటీ సంస్థలు వెబ్ సిరీస్ లను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాయి. తెలుగులోనూ మేకర్స్ వెబ్ సిరీస్ లను రూపొందించేందుకు మొగ్గు చూపుతున్నారు. పలువురు నిర్మాతలు ఓవైపు సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాత, నటి సుప్రియ యార్లగడ్డ ‘వ్యూహం’ అనే క్రైమ్ థ్రిల్లర్ ను నిర్మిస్తోంది. శశికాంత్ శ్రీవైష్ణవ్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నసాయి సుశాంత్ ప్రధాన పాత్రలో ఈ సిరీస్ రూపొందుతోంది. చైతన్య కృష్ణ, పావని గంగిరెడ్డి, రవీంద్ర విజయ్, శశాంక్ సిద్దంశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.


సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘వ్యూహం’ ట్రైలర్


తాజాగా ‘వ్యూహం’ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఓ యాక్సిడెంట్ లో చనిపోయిన ప్రెగ్నెంట్ లేడీ నుంచి స్టోరీ షురూ అవుతుంది. ఈ కేసు విచారణ క్రమంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. ఈ యాక్సెంట్ కు ఓ వైపు టెర్రరిస్టులతో, మరోవైపు మావోయిస్టులతో సంబంధం ఉన్నట్లు ట్రైలర్ లో చూపిస్తారు. ఈ యాక్సిడెంట్ కు వారికి సంబంధం ఏంటి? పోలీస్ ఆఫీసర్ గా హీరో విచారణలో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయి? అనేది ఈ సిరీస్ లో చూపించనున్నారు. ట్రైలర్ కట్ మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటోంది. ఇక ‘వ్యూహం’ వెబ్ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్స్ తో రూపొందుతోంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. డిసెంబరు 14 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.



ఆడియెన్స్ కు కొత్త అనుభూతి కలిగిస్తుందన్న మేకర్స్


‘వ్యూహం’ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని నిర్మాత సుప్రియ వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్ ఈ సిరీస్ నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సిరీస్ లోని కథ ప్రతి ఒక్కరిని అలరిస్తుందన్నారు. మంచి టాలెంట్ ఉన్న నటీనటులు, దర్శకుడు, సిబ్బంది కలిసి చక్కటి వెబ్ సిరీస్ ను రూపొందించినట్లు తెలిపారు. అటు ‘వ్యూహం’ తన కెరీర్ లో చక్కటి అనుభవాన్ని కలిగించిందని దర్శకుడు శశికాంత్ శ్రీవైష్ణవ్ తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి తొలి వెబ్ సిరీస్ ను తెరకెక్కించడం థ్రిల్లింగ్ క్రియేటివ్ రైడ్‌గా అనిపించిందన్నారు. ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో ACP అర్జున్ రామచంద్ర పాత్రను పోషించడం గొప్ప అనుభూతిని కలిగించిందని నటుడు సాయి సుశాంత్ రెడ్డివె చెప్పారు. చక్కటి కథతో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రూపొందినట్లు చెప్పారు. 






Read Also: అబ్బా, అనిపిస్తోన్న అబ్రార్ ఎంట్రీ సాంగ్, యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘యానిమల్’ - 24 గంటల్లో అన్ని వ్యూసా!