Balakrishna: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. డిసెంబరు 22 నుంచి ‘ఆహా’ ఓటీటీలో ‘అన్‌స్టాపబుల్’ లిమిటెడ్ ఎడిషన్ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఈ ఎపిసోడ్‌లో హీరోయిన్ శ్రియ, అలనాటి నటి సుహాసిని, దర్శకులు హరీష్ శంకర్, జయంత్ సి పరాంజీ సందడి చేశారు. ఈ షో కూడా బాలయ్య సెటైర్లు, పంచ్‌లు, జోకులతో సరదాగా సాగిపోతుందని తాజా ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. 


ఇవీ ప్రోమో హైలైట్స్:


హరీష్‌కు నాకు పాత కక్షలు ఉన్నాయి: షోలోకి వచ్చిన సుహాసిని గురించి బాలయ్య మాట్లాడుతూ.. ‘‘సుహాసినీది నాది జన్మజన్మల బంధం. శ్రియాది, నాది ఈ మిలినియం బంధం’’ అని అన్నారు. బాలకృష్ణ గురించి సుహాసిని మాట్లాడుతూ.. అప్పట్లో ఆయన చాలా సిగ్గుపడేవారని అన్నారు. దీంతో దర్శకుడు హరీష్ శంకర్.. ‘‘నేను నమ్మట్లేదు’’ అంటూ నవ్వించారు. ఆ తర్వాత బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘నేను కావాలనే మీ ముగ్గురితో మాట్లాడుతున్నాను. హరీష్‌ను ఎవాయిడ్ చేస్తున్నా. హరీష్‌కు, నాకు కొన్ని పాత కక్షలు ఉన్నాయి’’ అని అన్నారు. ఇందుకు హరీష్.. ‘‘నేను బ్రో అని అన్నాను అందుకే’’ అన్నారు. ‘‘ఏంటీ బ్రో నా? స్టూడియో తలుపులు మూసేయండి’’ అని బాలకృష్ణ అన్నారు. 


పవన్ మూవీపై సెటైర్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పవన్ రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉండటం వల్ల ఈ మూవీ షూటింగ్ ముందుకు సాగడం లేదు. ఈ విషయాన్ని బాలయ్య ఈ షోలో పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ఏమిటీ వారాహి హాలీడేసా? ఫ్రీగా ఉన్నావు’’ అని హరీష్‌ను అడిగారు. దీంతో హరీష్ ఏం చెప్పాలో తెలియక ముఖం దాచుకున్నాడు. ఆ తర్వాత.. ‘‘ఈ గ్యాప్ మట్టుకే వెకేషన్. సినిమా రిలీజ్ అయ్యాక సెన్సేషనే’’ అని చెప్పాడు. 


పవన్ ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా మాట్లాడలేదు: ‘‘నేను ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చూసింది.. బాలతోనే’’ అని సుహాసిని తెలిపారు. ఆ తర్వాత ఆమె ‘అన్‌స్టాపబుల్’ షోకు సంబంధించి.. బాలయ్యను కొన్ని ప్రశ్నలు అడిగారు. ‘‘ఈ షోలో గెస్టులు ఎవరైనా మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా మాట్లాడలేదని అనిపించిందా?’’ అని సుహాసిని అడిగారు. ఇందుకు బాలకృష్ణ సమాధానం చెబుతూ.. ఒకతను అలాగే చేశాడని అన్నారు. దానికి హరీష్.. ఎవరు అలా చేశారని అడిగాడు. ఇందుకు బాలయ్య.. ‘‘మీ వాడే’’ అంటూ పవన్ కళ్యాణ్ గురించి చెప్పారు. ఎప్పుడైనా మీకు ఒక గెస్టు మరీ ఎక్కువ మాట్లాడుతున్నాడు.. అస్సలు అపట్లేదు, అన్‌స్టాపబుల్ అనిపించారా? అని జయంత్ మరో ప్రశ్న అడిగారు. ఇందుకు బాలకృష్ణ వెంటనే రవితేజ పేరు చెప్పారు. 


‘అన్‌స్టాపబుల్’ లేటేస్ట్ ప్రోమోను ఇక్కడ చూడండి: 



‘అన్‌స్టాపబుల్’ లిమిటెడ్ ఎడిషన్‌లో ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ వచ్చాయి. డిసెంబరు 22న మూడో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. మొదటి ఎపిసోడ్‌లో ‘భగవంత్ కేసరి’ టీమ్ పాల్గొని సందడి చేసింది. కాజల్ అగర్వాల్, శ్రీలీల, అనిల్ రావిపూడి పాల్గొన్నారు. మూడో ఎపిసోడ్‌లో ‘యానిమల్’ టీమ్ సందడి చేశారు. హీరో, హీరోయిన్లు రణబీర్ కపూర్, రష్మిక మందన్నతో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పాల్గొన్నారు. తొలిసారి ఈ షో కి బాలీవుడ్ హీరో రావడం విశేషం. 


Also Read: ‘యానిమల్’ కోసం తృప్తి రెమ్యునరేషన్ అంతేనా? క్రేజ్‌కు, పారితోషికానికి సంబంధమే లేదు!