Jyothi Rai New Web Series: తెలుగు రాష్ట్రాల్లో సినిమాలతో పోల్చితే సీరియల్స్ కు ఉన్న అభిమానులు ఎక్కువ. తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ మాంచి రేటింట్స్ తో దూసుకెళ్తున్నాయి. ఇతర భాషల ముద్దుగుమ్మలు కూడా తెలుగు సీరియల్స్ లో బాగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో 'గుప్పెడంత మనసు' నటి జ్యోతిరాయ్ ఒకరు. పలు సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతోనూ సత్తా చాటుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఓ రొమాంటిక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లిప్ లాక్ తో రెచ్చిపోయిన జ్యోతిరాయ్
గత రెండు దశాబ్దాలుగా జ్యోతిరాయ్ ఇండస్ట్రీలో రాణిస్తోంది. సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్ లతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. గత కొద్ది కాలంగా వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ'నో మోర్ సీక్రెట్స్' అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఇందులో జ్యోతి రాయ్ కృనాల్ కపూర్ తో కలిసి నటిస్తోంది. విజయ్ కుడికుల దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సిరీస్ను పార్థిరెడ్డి, జీవన్ రెడ్డి, సంఘమిత్ర కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ ను జ్యోతి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇందులో బీచ్ లో కుర్రాడితో లిప్ లాక్ చేస్తూ కనిపించింది.
నటిగా సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్న కన్నడ బ్యూటీ
కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్ మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత 'బందె బరాటవ కాలా' అనే కన్నడ సీరియల్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించింది. అనంతరం ‘కన్యాదానం’ అనే సీరియల్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'గుప్పెడంత మనసు'తో మాంచి క్రేజ్ దక్కించుకుంది. ఇందులో జగతి పాత్రలో నటించి బాగా పాపులర్ అయ్యింది. ఓవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు వెండితెరపైనా అడుగు పెట్టింది. 'సీతారామ కల్యాణ', 'స్టేషన్ 3', 'దియ వర్ణపాటల' లాంటి సినిమాల్లో కనిపించింది. ఆ తర్వాత వెబ్ సిరీస్ లలోనూ నటించింది. 'దియా', 'గంధాడ్ గుడి', '99', 'మడిపు' సిరీస్ లతో మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం మరికొన్ని వెబ్ సిరీస్ లలో నటించబోతోంది. మరోవైపు సోషల్ మీడియాలో అందాల విందులో నెటిజన్లు అలరిస్తుంది.
యువ దర్శకుడితో రెండో పెళ్లి!
ఇక జ్యోతి రాయ్ వ్యక్తిగత విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్లు. 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లి అయ్యింది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. కొంతకాలం ఒంటరిగానే ఉంది. ఆ తర్వాత యువ దర్శకుడు సుకు పుర్వాజ్ తో ప్రేమాయణం కొనసాగింది. రీసెంట్ గా అతడిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. సుకు కన్నడ సినిమా పరిశ్రమలో పలు హిట్ సినిమాలను తెరకెక్కించారు. తెలుగులోనూ ‘మాస్టర్ పీస్’ అనే సినిమాకు పని చేశారు.
Read Also: ఆ పాట విని ఫ్యూజులు ఎగిరిపోయాయ్, 'నా పెట్టే తాళం' సాంగ్ పై సత్యశ్రీ షాకింగ్ కామెంట్స్