Jagadhatri Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో కీర్తికి కావాల్సింది క్లాసికల్ డాన్స్ కాదు సినిమా డాన్స్ అని కౌషికి అనడంతో తెల్ల మొహం వేస్తుంది నిషిక.
కౌశికి: ఏం సినిమా డాన్స్ రాదా అందుకే అన్నీ మనకే వచ్చు అని విర్రవీగకూడదు అంటుంది.
కేదార్ : నిజంగానే ధాత్రికి డాన్స్ వచ్చు తను నేర్పిస్తుంది అంటాడు.
మిగిలిన వాళ్ళు కూడా నేర్పించమనటంతో ధాత్రి కీర్తికి డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. అది చూసి కుళ్ళుకున్న నిషిక తన కాలికి ఉన్న మువ్వ తీసి ధాత్రి కాళ్ల కింద పడేలాగా చేస్తుంది. అది ధాత్రి కాలికి గుచ్చుకొని గాయం అవుతుంది.
కౌషికి: ధాత్రిని సోఫాలో కూర్చోబెడుతుంది తర్వాత ఆనందంతో వెలిగిపోతున్న నిషిక మొహం చూసి నీ కాలికి ఉన్న మువ్వ అక్కడికి ఎలా వెళ్లింది అని అడుగుతుంది.
నిషిక : నాకేం తెలుసు, నేను డాన్స్ చేస్తున్నప్పుడు మువ్వ పడిపోయి ఉంటుంది అని అబద్ధం చెప్పేస్తుంది.
కానీ కౌశికి ఒప్పుకోదు ఇంకా ఏదో అనబోతుంటే ధాత్రి అడ్డుకుంటుంది.
ధాత్రి : వదిలేయండి వదిన,నాకు ఏమీ పెద్ద గాయం కాలేదు అంటుంది. అప్పుడు కేదార్ ధాత్రిని తీసుకొని కిందికి వెళ్ళిపోతాడు.
కౌషికి : ఎదుటి వాళ్ళ కళ్ళల్లో బాధ చూసి ఆనందపడే శాడిస్ట్ వి అని నిషిక ని మందలించి వెళ్ళిపోతుంది.
మరోవైపు ధాత్రిని మంచం మీద కూర్చోబెట్టి ఆమె కాలికి ఆయింట్మెంట్ రాద్దాం అనుకుంటాడు కేదార్.
ధాత్రి: పక్కన ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది.
కేదార్: లేరు అంటాడు.
ధాత్రి: మరైతే ఇలా ఇవ్వు నేనే రాసుకుంటాను అని ఆయింట్మెంట్ రాసుకుంటూ ఉంటుంది.
ఈ మాటలు విన్న కౌషికి వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి అసలు మీ ఇద్దరు భార్యాభర్తలేనా, కేదార్ నీ మీద చేయి వేస్తే ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు అసలు మీరిద్దరూ ఎక్కడ పెళ్లి చేసుకున్నారు అని నిలదీస్తుంది. ఇద్దరూ చెరొక ఆలయం పేరు చెప్పి దొరికిపోతారు.
కేదార్ : సర్దుకుని బస్ స్టాప్ దగ్గర ఉన్న రామాలయం అని చెప్తాడు.
సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కౌషికి. తర్వాత భార్యాభర్తలిద్దరూ వదినకి అనుమానం వచ్చినట్లుగా ఉంది మనం మరింత జాగ్రత్త పడాలి అనుకుంటారు.
కౌషికి : బయటికి వెళ్ళిన తర్వాత రామాలయం పంతులు గారికి ఫోన్ చేసి ఏదో చెప్తుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎక్కడ పెళ్లి చేసుకున్నారు, అసలు పెళ్లి చేసుకున్నారో లేదో అని అనుకుంటుంది.
మరోవైపు తనని కాకుండా ధాత్రిని వెనకేసుకుని వస్తున్నందుకు కౌషికినీ తిట్టుకుంటూ ఉంటారు నిషిక, కాచి, బూచి. అప్పుడే అక్కడికి వస్తుంది కౌషికి.
కౌషికి: ధాత్రి కాలి కింద మువ్వ ఎందుకు వేసావు అని డైరెక్ట్ గా నిలదీస్తుంది.
నిషిక : అదేంటి అలా అడుగుతున్నారు నేను వేయటం మీరు చూశారా అని అడుగుతుంది.
కౌషికి : నేను కాదు కీర్తి చూసింది అని కీర్తితోనే జరిగిందంతా చెప్పిస్తుంది. అయినా నేను ఆ పని చేయలేదు అని దబాయిస్తుంది నిషిక. తప్పు మీద తప్పు చేస్తున్నావు ఇది మంచిది కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కౌషికి.
ఆ తర్వాత కీర్తి ధాత్రి వాళ్ళ దగ్గరికి వెళ్లి మువ్వ నిషిక అత్త వేసింది అని చెప్తుంది. కేదార్ కోప్పడతాడు వెళ్లి నిలదీస్తాను అంటాడు.
ధాత్రి : నిషికా యే ఆ పని చేసిందని నాకు తెలుసు కానీ నా చెల్లెల్ని అందరి ముందు దోషిని చేయలేను కదా అందుకే ఊరుకున్నాను అంటుంది.
కీర్తి: నాతో ఎవరూ ఆడుకోవడం లేదు నువ్వు నాతో ఆడుకో అని ధాత్రిని అడుగుతుంది.
ధాత్రి: నాకు కాలు నొప్పి కదా ఆడలేను అంటుంది.
అప్పుడు కేదార్ బూచిని పిలిచి కీర్తిని ఆడించమని అతనితో కీర్తిని పంపిస్తాడు. సరే అని కీర్తి కళ్ళకి గంతలు కట్టి ఆడుకుంటూ ఉండగా బూచికి ఫోన్ వస్తుంది. మాట్లాడుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బూచి. అప్పుడే ఆరేసిన చీర అక్కడ పడుతుంది. అది గమనించిన ధాత్రి కీర్తి ఆ చీరని తొక్కుతుంది ఏమో అని కంగారు పడుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: అమ్మను దూరం పెట్టాను, మూర్ఖంగా ప్రవర్తించాను - జాన్వీ కపూర్