Harsha Chemudu's Sundaram Master OTT Release Date announed officially: హర్ష చెముడు... తెలుగు ప్రేక్షకులకు 'వైవా' హర్షగా బాగా తెలుసు. 'కలర్ ఫోటో' నుంచి మొదలు పెడితే... 'మంత్ ఆఫ్ మధు' వరకు అనేక సినిమాల్లో హీరో స్నేహితుడిగా, కీలక పాత్రల్లో నవ్వించారు. అవకాశం వచ్చినప్పుడు, భావోద్వేగభరిత పాత్రలు లభించినప్పుడు ప్రేక్షకుల్ని కంటతడి కూడా పెట్టించారు. ఆయన హీరోగా నటించిన సినిమా 'సుందరం మాస్టర్'. ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదల అయ్యింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజుకు రెడీ అయ్యింది. 

Continues below advertisement


ఆహాలో 'సుందరం మాస్టర్'...
ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?
Sundaram Master On Aha OTT: 'సుందరం మాస్టర్' ఓటీటీ రైట్స్ ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహా సొంతం చేసుకుంది. ఈ నెల 28 నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుందని ఆహా తెలిపింది.


Also Readవెంకటేష్, అనిల్ రావిపూడి లేటెస్ట్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్... ఆయన ఎవరంటే?






'సుందరం మాస్టర్' సినిమాలో హర్ష చెముడు సరసన దివ్యశ్రీ పాద కథానాయకగా నటించారు. ఇంతకు ముందు 'కలర్ ఫోటో'తో పాటు కొన్ని సినిమాల్లో వాళ్లిద్దరూ నటించారు. అయితే... హీరో హీరోయిన్లుగా వాళ్లకు తొలి చిత్రమిది. 'సుందరం మాస్టర్' చిత్రాన్ని ఆర్‌టీటీ వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. 'కెజిఎఫ్'లో ఇనాయత్ ఖలీల్ రోల్ చేసిన బాలకృష్ణ, హర్షవర్ధన్, భద్రం తదితరులు ఇతర పాత్రలు చేశారు.


Also Read: రెండో రోజు పెరిగిన 'ఓం భీమ్ బుష్' కలెక్షన్స్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?



'సుందరం మాస్టర్' కథ ఏమిటంటే?
అనగనగా మిరియాల మిట్ట అనే గూడెం ఉంది. అదీ పాడేరుకు 90 కిలోమీటర్ల దూరంలో! అక్కడి ప్రజలు జనజీవన స్రవంతికి దూరంగా, బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేకుండా ఉన్నారు. వాళ్ళందరూ ఓ కుటుంబంలా కలిసి మెలిసి జీవిస్తుంటారు. వాళ్ళు తమ ఊరికి మరొకరిని రానివ్వరు. అటువంటిది ఓ రోజు ఆ జనాలు తమకు ఒక ఇంగ్లీష్ టీచర్ కావాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. అది చూసి సుందర్ రావు (హర్ష చెముడు)ను పంపిస్తుంది ప్రభుత్వం.


సుందర్ రావు (వైవా హర్ష)ను మిరియాల మిట్ట పంపించే ముందు ఎమ్మెల్యే (హర్ష వర్ధన్) తనకు ఒక పని చేసి పెట్టమని అడుగుతాడు. ఆ ఊరిలో విలువైనది ఒకటి ఉందని, అదేమిటో తెలుసుకుని చెప్పమని అడుగుతాడు. మూడు రోజుల్లో పని పూర్తి చేసుకుని మళ్లీ విశాఖ వస్తానని చెబుతాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో మిరియాల మిట్ట వెళ్లిన సుందర్ రావుకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అతడికి ఇంగ్లీష్ రాదని తెలుసుకున్న అక్కడి ప్రజలు ఏం చేశారు? చివరికి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.