కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు (Sree Vishnu) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా '#సింగిల్' (Single Movie). మే 9న థియేటర్లలో విడుదల అయ్యింది. ఫన్ ఫిలిం అంటూ క్రిటిక్స్ & ఆడియన్స్ చేత అప్రిసియేషన్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.


ఒక్కటి కాదు... ఐదు భాషలలో!
Single Movie OTT Platform: 'సింగిల్' సినిమాను తెలుగులో థియేట్రికల్ రిలీజ్ చేశారు. అయితే... ఓటీటీ రిలీజ్ కోసం మరొక నాలుగు భాషలలో డబ్బింగ్ చేశారు. ఇప్పుడు తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. 


'సింగిల్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు... మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, జూన్ 6వ తేదీ నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.


Also Readఅన్నపూర్ణ స్టూడియోలో కాదు... అఖిల్ పెళ్లి ముహూర్తం నుంచి అతిథులు, వేదిక, జైనాబ్ బ్యాగ్రౌండ్ వరకూ... కంప్లీట్ డీటెయిల్స్






ఇద్దరు హీరోయిన్లు... చివరకు సింగిల్!
'సింగిల్' సినిమాలో శ్రీ విష్ణు సరసన కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండే హీరో స్నేహితుడిగా ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ మంచి క్యారెక్టర్ చేశారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే...


మెట్రో రైలులో పూర్వా (కేతికా శర్మ)ను చూసిన విజయ్ శ్రీ విష్ణు ప్రేమలో పడతాడు. అతడు ఒక బ్యాంకులో ఉద్యోగి. ఆ అమ్మాయి ఆడి కార్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్. పూర్వాని ప్రేమలో పడేయడానికి విజయ్ చాలా ప్లాన్స్ వేస్తాడు. ఆ ప్లాన్స్ వల్ల హరిణి (ఇవానా) అతనితో ప్రేమలో పడుతుంది. తనను ప్రేమించమని అతడి వెంట పడుతుంది. చివరకు ఇద్దరిలో విజయ్ ఎవరిని ప్రేమించాడు? ఇద్దరు హీరోయిన్లు ఉన్న చివరికి ఒంటరిగా ఎందుకు మిగిలాడు? అసలు ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


Also Read'థగ్ లైఫ్' రివ్యూ: కమల్‌ను శింబు డామినేట్ చేశారా? 'నాయకుడు'కు మించి మణి తీశారా? సినిమా హిట్టా? ఫట్టా?



'సింగిల్' సినిమాకు 'నిను వీడని నీడను నేనే' ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళ్యా ఫిలింస్ సంస్థల మీద విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ప్రజెంట్ శ్రీ విష్ణు చేస్తున్న సినిమాలు పూర్తి అయ్యాక సీక్వెల్ స్టార్ట్ కావచ్చు.