OTT Releases : ఈవారం ఓటీటీలోకి పలు మోస్ట్ అవైటింగ్ వెబ్ సిరీస్ లు, సినిమాలు అడుగు పెట్టబోతున్నాయి. అందులో 'హిసాబ్ బరాబర్' అనే బ్యాంక్ స్కాం థ్రిల్లర్ తో పాటు తెలుగు హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'రజాకార్' వరకు పలు ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి ఈటీవీ విన్, సోనీ లివ్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా, జీ5 వంటి ఓటీటీలలో రిలీజ్ కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల లిస్ట్ చూద్దాం.


హిసాబ్ బరాబర్ - జీ 5 
మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన బ్యాంక్ స్కామ్ థ్రిల్లర్ 'హిసాబ్ బరాబర్'. ఓ బ్యాంకు చేసిన మోసాన్ని బయటపెట్టే నిజాయితీగల టీసీ చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ డైరెక్ట్ గా జీ5 ఓటీటీలో జనవరి 24 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. 


రజాకార్ - ఆహా 
పీరియాడికల్ హిస్టారికల్ యాక్షన్ సినిమా 'రజాకార్'లో అనసూయ భరద్వాజ్, వేదిక, ఇంద్రజ, రాజ్ అర్జున్, బాబి సింహ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలోకి వచ్చిన 10 నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలో అడుగు పెట్టబోతోంది. 'రజాకార్' మూవీ జనవరి 24 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. 


వైఫ్ ఆఫ్ - ఈటీవీ విన్ 


ఈటీవీ విన్ సంక్రాంతి సందర్భంగా అనౌన్స్ చేసిన కొత్త సినిమాలలో 'వైఫ్ ఆఫ్' కూడా ఒకటి. దివ్యశ్రీ, సాయి శ్వేత, అభినవ్ మణికంఠ, నిఖిల్ గాజుల ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా కూడా జనవరి 23 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. 

పోతుగడ్డ - ఈటీవీ విన్ 


పృథ్వి దండముడి, బిస్మయ శ్రీ, శత్రు ప్రశాంత్ కార్తీ, ఆడుకలం నరేన్ లీడ్ రోల్స్ పోషించిన మూవీ 'పోతుగడ్డ'. చాలా రోజుల క్రితమే థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతోంది. నిజానికి ఈ మూవీ ఓటీటీలో నవంబర్ 14 నుంచి అందుబాటులోకి రాబోతోంది అని కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. కానీ చాలా గ్యాప్ తరువాత ఎట్టకేలకు ఈటీవీ విన్ ఓటీటీలో జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఓ ప్రేమ జంట, వాళ్ల చుట్టూ తిరిగే రాజకీయాలతో 'పోతుగడ్డ' మూవీ రూపొందింది. 


ది స్టోరీ టెల్లర్ - జనవరి 28 - డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 
కోల్డ్ ప్లే షో - అహ్మదాబాద్ నుంచి లైవ్ స్ట్రీమి - జనవరి 26 - డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 
స్వీట్ డ్రీమ్స్ (హిందీ రొమాంటిక్ మూవీ) - జనవరి 24 - డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 


ప్రైమ్ టార్గెట్ (సైఫై మూవీ) - జనవరి 22 - ఆపిల్ టీవీ ప్లస్ 
హార్లెమ్ సీజన్ 3 - జనవరి 23 - అమెజాన్ ప్రైమ్ వీడియో
డిడి (ఇంగ్షీషు మూవీ) - జనవరి 26- జియో సినిమా 
ది గర్ల్ విత్ ది నీడిల్ జనవరి 24 - MUBI ఓటీటీ 


ది నైట్ ఏజెంట్ సీజన్ 2 - జనవరి 23 - నెట్ ఫ్లిక్స్
షాఫ్టెడ్ - జనవరి 24- నెట్ ఫ్లిక్స్
ది శాండ్ క్యాజిల్ - - జనవరి 24- నెట్ ఫ్లిక్స్
ది ట్రామా కోడ్: హీరోస్ ఆన్ కాల్ - జనవరి 24- నెట్ ఫ్లిక్స్




Also Read: Saif Ali Khan Attacker: ఇతనే సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసింది - ఫోటో రిలీజ్ చేసిన ముంబై పోలీసులు