Pic Of Saif Ali Khan Attacker Released: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తన బాంద్రా అపార్ట్‌మెంట్‌లో కత్తిపోట్లకు గురైన కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేసతున్నారు గురువారం దాడి తర్వాత భవనం మెట్ల నుండి దాడికి పాల్పడిన వ్యక్తి పారిపోతున్న దృశ్యాలు CCTV ఫుటేజ్‌లో బయటపడ్డాయి. బాంద్రాలోని తన 12వ అంతస్తులోని అపార్ట్‌మెంట్‌లోకి ఖాన్‌పై దాడి చేసిన నిందితుడు, ఆరవ అంతస్తులోని భవనం మెట్ల నుండి బయటకు వస్తున్న సీసీ టీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఉపయోగించేందుకు వీలుగా మెట్లు నిర్మించారు. వాటి ద్వారా అతను ఇంట్లోకి చొరబడినట్లుగా గుర్తించారు.
ఈ మెట్ల వెనుక చాలా బ్లైండ్ స్పాట్లు ఉన్నాయి. అంటే సీసీ కెమెరాలకు కూడా అందవు. అయితే ఆరో అంతస్తులో సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్‌ల నుండి పోలీసులు అతన్ని పోలీసులు గుర్తించగలిగారు. సైఫ్ ఇంట్లోకి దుండగుడు అత్యవసర అగ్నిమాపక ద్వారం ద్వారా ప్రవేశించాడని పోలీసులు గుర్తించారు. దొంగకు అది నటుల ఇల్లు అని తెలియకపోవచ్చునని.. దొంగతనం ఉద్దేశంతోనే ఇంట్లోకి వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. దుండగుడికి ఇంటి యజమాని ఎవరో తెలియదని పోలీసులు చెబుతున్నారు. అతని ఉద్దేశం బాగా ధనవంతుల ఇంట్లో దొంగతనం చేయడం కావొచ్చునని చెబుతున్నారు.
Also Read: పటౌడీ వారసుడు, వేల కోట్ల ఆస్తులకు అధిపతి... నవాబ్ సైఫ్ జీవితంలో ఆసక్తికర విషయాలు తెలుసా?
దుండగుగు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ముందుగా పనిమనిషి గదిలోకి వెళ్లాడు. దాంతో పనిమనిషి కేకలు వేయడం ప్రారంభింది. దీంతో ఏదో జరుగుతోందని సైఫ్ అక్కడికి వచ్చాడు. అందరూ మేలుకుటున్నారని తన దొంగతనం ప్లాన్ ఫెయిలయిందని..దొరికిపోతానన్న ఉద్దేశంతో ఎదురుగా వచ్చిన సైఫ్‌పై దాడి చేసి పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు సైఫ్ చేసిన ప్రయత్నంలోనే ఎక్కువగా గాయాలయినట్లుగా తెలుస్తోంది. పనిమనిషి చేతికి స్వల్ప గాయమైంది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వ్యక్తిపై BNS లోని సెక్షన్ 311, 312, 331(4), 331(6) మరియు 331(7) తో సహా అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
సీసీ ఫుటేజీ లో దుండగుడు దృశ్యాలు నమోదు కావడంతో పోలీసులు అతన్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అతను ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అయి ఉంటాడని అనుమానిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Also Rea: సైఫ్ పై హత్యాయత్నం కేసులో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దర్యాప్తు - జేబులో గన్నుతో దయా నాయక్ ఎంట్రీ !