Mufasa The Lion King OTT Release Update: సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్‌లో ఓ మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్‌కే ఫ్యాన్స్ పడిపోతుంటారు. అందుకే ఆయన నటించిన సినిమాలే కాకుండా, ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చిన చిత్రాలను కూడా ఎగబడి మరీ చూస్తుంటారు. పవన్ కళ్యాణ్ ‘జల్సా’, ఎన్టీఆర్ ‘బాద్‌షా’, అడవి శేష్ ‘మేజర్’ వంటి చిత్రాలకు మహేష్ ఇచ్చిన వాయిస్ ఓవర్ ఎలాంటి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మహేష్ బాబు కనిపించకుండా, సినిమా అంతా ఆయన వాయిస్ వినిపిస్తే.. ఆ మ్యాజిక్ కూడా జరిగింది. ఇటీవల వచ్చిన ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ సినిమాతో.


హాలీవుడ్‌ సంస్థ డిస్నీ రూపొందించిన ఈ మ్యూజికల్‌ లైవ్‌ యాక్షన్‌ చిత్రంలోని మెయిన్ పాత్రకు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. హిందీలో షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పిన ఈ చిత్రానికి మొదట్లో తెలుగులో ఎవరు చెబుతారా? అని అంతా అనుకున్నారు. ఈ డబ్బింగ్ విషయంలో టాలీవుడ్ స్టార్ హీరోల పేర్లు ఎన్నో వినిపించాయి కూడా. చివరికి ఆ అవకాశం మాత్రం మహేష్ బాబునే వరించింది. ముఫాసా పాత్రకు మహేష్ చెప్పిన డబ్బింగ్ చిత్ర హైలెట్స్‌లోనే ఒకటిగా నిలిచింది. అందుకే, తెలుగులోనూ ఈ సినిమా భారీగా కలెక్షన్స్‌ని రాబట్టింది. ఇప్పుడీ మ్యాజికల్ ఫిల్మ్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే..


Also Read: క్లీన్ కామెడీ, నో అసభ్యత, డబుల్ ఫన్... 'రాబిన్‌హుడ్‌'కు నితిన్ ఫస్ట్ రివ్యూ


‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ చిత్ర ఓటీటీ విడుదల వివరాలను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది. మార్చి 26 నుంచి ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో జియో హాట్ స్టార్‌లో అందుబాటులోకి రానుందని సదరు ఓటీటీ సంస్థ ఇన్ ‌స్టా వేదికగా ప్రకటించింది. దీంతో ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నామంటూ, జియో హాట్ స్టార్‌కు థ్యాంక్స్ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు, మహేష్ బాబు అభిమానులు. 2019లో వచ్చిన ‘ది లయన్ కింగ్’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. ‘ది లయన్ కింగ్’లో ముఫాసాకు రవి శంకర్ డబ్బింగ్ చెబితే, సింబాకు నేచురల్ స్టార్ నాని తన గాత్రాన్నిచ్చారు.






‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ ఓటీటీ విడుదల కోసం వీక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆ విషయం ఈ మధ్యకాలంలో ఈ సినిమా ట్రెండ్ అయిన విధానం చూస్తే చెప్పవచ్చు. ఇక అలాంటి ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ.. జియో హాట్‌స్టార్ అధికారికంగా డేట్ చెప్పేసింది కాబట్టి.. మార్చి 26 ఎప్పుడెప్పుడు వస్తుందా? అని క్యాలెండర్‌‌లో డేట్స్ కౌంట్ చేసుకునే ఫ్యాన్స్ ఈ సినిమాకున్నారు. అందులోనూ పిల్లల స్కూల్స్ కూడా చివరికి వచ్చేశాయి. కొన్ని స్కూళ్లకు సెలవులు, మరికొన్ని స్కూళ్లకు ఒక్కపూట బడులు ఉంటాయి కాబట్టి.. ఈ సినిమా ఓటీటీ విడుదల విషయంలో మేకర్స్ మంచి నిర్ణయమే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. చూద్దాం మరి.. ఓటీటీలో ఈ సినిమా ఎలా ఆదరణ రాబట్టుకుంటుందో.. ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో..!


Also Readతెలుగు టీవీలోకి పవన్ 'ఓజీ' హీరోయిన్ ప్రియాంక లేటెస్ట్ తమిళ్ మూవీ 'డియర్ బ్రదర్'... ప్రీమియర్ డేట్ ఫిక్స్