OTT Crime Thriller: సీఎం బాబాయ్ మర్డర్ మిస్టరీ... ఓటీటీలోకి వచ్చేసిన పొలిటికల్ క్రైం థ్రిల్లర్, ఎందులో చూడొచ్చో తెలుసా?

Hatya OTT Streaming : ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రను పోషించిన తెలుగు పొలిటికల్ క్రైం థ్రిల్లర్ 'హత్య' జనవరి 24న థియేటర్లలోకి వచ్చింది. నేటి నుంచి ఈ మూవీ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ మొదలైంది.

Continues below advertisement

ధన్య బాలకృష్ణ, పూజ రామచంద్రన్, రవి వర్మ ప్రధాన పాత్రలు పోషించిన 'హత్య' మూవీ 2025 జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే థియేటర్లలో ఈ మూవీకి పెద్దగా ఆశించిన రెస్పాన్స్ దక్కలేదు. తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. 

Continues below advertisement

అమెజాన్ ప్రైమ్ వీడియోలో హత్య స్ట్రీమింగ్

శ్రీదివ్య బసవ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ మర్డర్ మిస్టరీ 'హత్య'. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిందని టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక టాక్ నడిచింది. ఆ తరువాత మూవీ పై అంచనాలు భారీగా పెరిగాయి. కానీ రిలీజ్ అయ్యాక ఈ క్రైం థ్రిల్లర్ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. సినిమా మొత్తం సీఎం బాబాయి మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ మార్చ్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమా అందుబాటులో ఉంది. ఏ రేటెడ్ తో ఈ పొలిటికల్ క్రైం థ్రిల్లర్ అందుబాటులో ఉంది. థియేటర్లలో రిలీజ్ అయిన ఏడు వారాల తర్వాత ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం.

Also Read: క్లీన్ కామెడీ, నో అసభ్యత, డబుల్ ఫన్... 'రాబిన్‌హుడ్‌'కు నితిన్ ఫస్ట్ రివ్యూ 

ముఖ్యమంత్రి బాబాయి ఈ సినిమాలో దారుణ హత్యకి గురవుతాడు. ముందుగా దీన్ని గుండెపోటుగా చిత్రీకరిస్తారు. సంచలనంగా మారిన ఈ కేసును ఆ తర్వాత ఓ పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ధర్మేంద్ర రెడ్డిని అంత దారుణంగా ఎందుకు చంపారనే అనుమానంతో అన్ని కోణాల్లో కేసుని దర్యాప్తు చేస్తుంటుంది పోలీస్ ఆఫీసర్. ఈ క్రమంలో ధర్మేంద్ర రెడ్డికి ఆర్థిక సమస్యలు వచ్చాయని కూడా తెలుసుకుంటుంది. ఇక ధర్మేంద్ర రెడ్డికి సలీమ అనే మహిళతో ఉన్న సంబంధం గురించి తెలుసుకొని పొలిటికల్ ఎజెండాతో ఈ హత్యను చేశారా? ఆర్థిక సమస్యలే కారణమా? అనే రీతిలో ముందుకు వెళ్తుంది. మరి ఈ మర్డర్ మిస్టరీని ఆ పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా చేదించింది? ఆయనను హత్య చేసింది ఎవరు?  సీఎం బాబాయ్ కి గుండెపోటు వచ్చిందని ఎందుకు చెప్పారు? ఇలాంటి విషయాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీలో హత్యకు గురైన నేత పేరు ధర్మేంద్ర రెడ్డి. ఈ మూవీలో రవి వర్మ వయసు మళ్లిన ధర్మేంద్ర రెడ్డి పాత్రలో నటించారు. ఐపీఎస్ అధికారిణి సుధారావుగా ధన్య బాలకృష్ణ , వీఎస్ జీవన్ రెడ్డిగా భరత్ రెడ్డి నటించారు. షాహీన్ పాత్రలో పూజా రామచంద్రన్ నటించగా, అనితగా బిందు చంద్రమౌళి కనిపించింది. శ్రీకాంత్ అయ్యంగార్, రఘునాథ్ రాజు, శివాజీ రాజా తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. నరేష్ కుమార్ సంగీతం అందించగా, శ్రీదివ్య బసవ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మహాకాళి పిక్చర్స్ బ్యానర్ పై ఈ మూవీని ప్రశాంత్ రెడ్డి నిర్మించారు. ఇప్పుడు ఎట్టకేలకు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.  

Continues below advertisement