Nithiin is confident about Robinhood after watching the film: మార్చి 28న థియేటర్లలోకి వస్తున్న 'రాబిన్‌హుడ్' మీద హీరో నితిన్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఆయన సినిమా చూశారు. తన ఫీలింగ్ ఏమిటనేది ప్రెస్‌మీట్‌లో చెప్పారు. 'రాబిన్‌హుడ్' ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.
బ్లాక్ బస్టర్ అని చెప్పను... కానీ కాన్ఫిడెన్స్ ఉంది
దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి 'రాబిన్‌హుడ్' సినిమాను మార్చి 10వ తేదీ రాత్రి చూసినట్టు నితిన్ తెలిపారు. షో పూర్తి అయ్యాక ఆల్మోస్ట్ గంట సేపు మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. ''సినిమా చూశాక మేం గంట సేపు ప్రేమించుకుని, కౌగిలించుకుని, ఆల్మోస్ట్ కామించుకోబోయి ఆగిపోయాం'' అని నితిన్ చెప్పారు. ఆయన మాటలకు హీరోయిన్ శ్రీ లీల నవ్వు ఆపుకోలేక వెనక్కి తిరిగారు. తాము సినిమా చూసిన సంగతి నిర్మాత రవిశంకర్ గారికి తెలియదని నితిన్ చెప్పారు.
ఎక్స్ట్రాడినరీ, అదిరిపోతుంది, బ్లాక్ బస్టర్ వంటి మాటలు తాను మాట్లాడానని నితిన్ అన్నారు. అయితే సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందని చెప్పారు. తాము చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని వివరించారు. తన కెరీర్, అలాగే దర్శకుడు వెంకీ కుడుముల కెరీర్... ఇద్దరి ప్రయాణంలో చాలా పెద్ద విజయవంతమైన సినిమా అవుతుందని తెలిపారు. తన పుట్టినరోజు మార్చి 30న అని, 'రాబిన్‌హుడ్' సినిమా మార్చి 28న వస్తుందని, తనకు పెద్ద విజయం అందిస్తుందని ఆయన తెలిపారు. దర్శకుడు వెంకీ తనకు ఇస్తున్న బిగ్గెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఈ సినిమా అని అన్నారు. అదే మాట ప్రేక్షకులు అందరూ అంటారని తెలిపారు.
'రాబిన్‌హుడ్'లో 'భీష్మ'కి డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్!
'రాబిన్‌హుడ్'కు బిగ్గెస్ట్ బలం, సినిమా యూఎస్పీ ఎంటర్‌టైన్‌మెంట్ అని నితిన్ చెప్పారు. ''వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన 'ఛలో'లో కంటే డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ 'భీష్మ'లో ఉంది. 'భీష్మ' కంటే డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ 'రాబిన్‌హుడ్'లో ఉంటుంది. నాతో పాటు శ్రీ లీల, రాజేంద్ర ప్రసాద్ గారు, 'వెన్నెల' కిశోర్ కాంబినేషన్ సీన్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుకుంటారు. ఎక్కడా అసభ్యత ఉండదు. క్లీన్, హెల్దీ, ఆర్గానిక్ కామెడీ ఫిల్మ్ ఇది. ఇంత ఆర్గానిక్ కామెడీ సినిమాను ఈ మధ్య కాలంలో చూడలేదు. ఈ సినిమాకు హీరో నేను. శ్రీ లీల హీరోయిన్. అయితే, నా పక్కన మరో ఇద్దరు హీరోలు రాజేంద్ర ప్రసాద్ గారు, 'వెన్నెల' కిశోర్ గారు. వినోదం మాత్రమే కాదు... దాంతో పాటు వెంకీ కుడుముల కథ కూడా చెప్పాడు. సినిమా చూశాక వెంకీ కుడుముల 3.0 అంటారు. క్లైమాక్స్ చూశాక 'వావ్' అంటారు. వెంకీ కుడుముల బాగా రాశారని అందరూ అప్రిషియేట్ చేస్తారు'' అని నితిన్ చెప్పారు.
Also Read: తెలుగు టీవీలోకి పవన్ 'ఓజీ' హీరోయిన్ ప్రియాంక లేటెస్ట్ తమిళ్ మూవీ 'డియర్ బ్రదర్'... ప్రీమియర్ డేట్ ఫిక్స్
మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై లేకపోతే 'రాబిన్‌హుడ్' సినిమా ఇంత బాగా వచ్చేది కాదని నితిన్ అన్నారు. చిన్నతనంలో చేసిన చిలిపి దొంగతనం గురించి చెప్పమంటే... పెద్దయిన తర్వాత తన భార్య శాలిని కందుకూరి హృదయాన్ని కొట్టేశానని చెప్పారు నితిన్.