Raagin Raj's Thala Movie OTT Streaming On Amazon Prime Video: దర్శకుడు అమ్మ రాజశేఖర్ తన తనయుడు రాగిన్ రాజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'తల' (Thala). ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. దీప ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో అంకిత నస్కర్ హీరోయిన్ కాగా.. '6 టీన్స్' ఫేమ్ రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, 'సత్యం' రాజేష్, అజయ్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఆ ఓటీటీలోకి స్ట్రీమింగ్
థియేటర్లలో రిలీజై నెల రోజులైనా కాక ముందే 'తల' మూవీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video) ఓటీటీలోకి రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక స్టోరీ విషయానికొస్తే.. హీరో చిన్నప్పుడే తండ్రి దూరం కాగా తల్లి వద్ద పెరుగుతాడు. తమది ప్రేమ వివాహం కాగా ఆ జ్ఞాపకాలతో తల్లి అనారోగ్యానికి గురవుతుంది. దీంతో తండ్రిని ఎలాగైనా తీసుకురావాలని ఆయన్ను వెతుకుతూ వెళ్లిన హీరోకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఈ ప్రయాణంలో హీరో హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. అతనికి అసలు తండ్రి దొరికాడా..? అతని లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read: 'బాలీవుడ్ నా మీద కుట్రలు పన్నింది' - ఇండస్ట్రీలోనే లేకుండా చేయాలని చూశారన్న నటుడు గోవిందా
ఒకే ఓటీటీలోకి రెండు సినిమాలు
'తల' సినిమాతో పాటే మరో సినిమా కూడా సడెన్‌గా అదే 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది నవంబర్ 8న రిలీజ్ అయిన 'జాతర' అనే మూవీ కూడా ఈ ఓటీటీలోకి సేమ్ రెంటల్ విధానంలోనే అందుబాటులోకి వచ్చింది. ఓ గ్రామంలో గంగమ్మ తల్లి దేవత బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కించారు. త్వరలోనే ఈ రెండు సినిమాలు ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు..
- సోనీ లివ్ - అఖిల్ 'ఏజెంట్' (మార్చి 14)
- నెట్ ఫ్లిక్స్ - అమెరికన్ మ్యాన్ హంట్ (డాక్యుమెంటరీ సిరీస్ - మార్చి 10)
- అమెజాన్ ప్రైమ్ వీడియో - వీల్ ఆఫ్ టైమ్ 3 (వెబ్ సిరీస్) - మార్చి 13, బీ హ్యాపీ (హిందీ) - మార్చి 14
- జీ5 - ఇన్ గలియోంమే (హిందీ - మార్చి 14)
- ఈటీవీ విన్ - పరాక్రమం (తెలుగు) - మార్చి 13
- ఆపిల్ టీవీ ప్లస్ - డోప్‌థీప్ (వెబ్ సిరీస్ - మార్చి 14)
- ఆహా - రేఖాచిత్రం (కేవలం తెలుగులోనే - మార్చి 14)