Home Town Web Series Teaser And OTT Release On Aha: ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakala), యాంకర్ ఝాన్సీ (Jhansi) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'హోమ్ టౌన్'. '90స్' వెబ్ సిరీస్ నిర్మాత నవీన్ మేడారం ఈ సీరిస్ నిర్మించగా.. శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌లో కుటుంబ విలువలు, లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్ తెరెక్కినట్లు తెలుస్తోంది. సిరీస్‌లో ప్రజ్వల్ యద్మ, సాయిరాం, అనిరుద్, జ్యోతి కీలక పాత్రలు పోషించారు.

నవ్వులు పూయిస్తోన్న టీజర్

తాజాగా, ఈ సిరీస్ టీజర్ విడుదల చేయగా నవ్వులు పూయిస్తోంది. బాల్యం జ్ఞాపకాలను గుర్తు చేసేలా.. ప్రేమ, స్నేహం, అల్లరి, ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌లో సిరీస్ స్టోరీ ఉన్నట్లుగా టీజర్‌ను బట్టి తెలుస్తోంది. 'కలలు ప్రారంభమయ్యే ప్రాంతం.. ఫస్ట్ లవ్‌ను అనుభవించే చోటు.. ఎప్పటికీ నిలిచిపోయే స్నేహం' అంటూ సోషల్ మీడియా వేదికగా టీం వీడియో రిలీజ్ చేసింది. ముగ్గురు స్నేహితులు చేసే అల్లరి.. ఫస్ట్ లవ్, ఫ్యామిలీతో చేసే సందడి అన్నింటినీ ఈ సిరీస్‌లో చూపించనున్నట్లు తెలుస్తోంది. 

ఏప్రిల్ 4న 'ఆహా'లోకి

'హోమ్ టౌన్' (Home Town) వెబ్ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి ఆహా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. నవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం ప్రొడ్యూస్ చేయగా.. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం, స్నేహాలు, ఫస్ట్ లవ్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి అంశాలను టచ్ చేస్తూ.. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌గా ఫస్ట్ ఫైట్, ఫస్ట్ హార్ట్ బ్రేక్ వంటి వాటిని కూడా కథాంశంగా తీసుకుని సిరీస్ తెరకెక్కించినట్లు టీం తెలిపింది. 

Also Read: క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి లవ్, కోర్ట్ డ్రామా వరకూ.. ఈ వారం ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే మూవీస్, సిరీస్‌లు ఇవే!

'బాబు బాగా బిజీ', 'సిన్' వెబ్ సిరీస్, 'డెవిల్' సినిమాలకు దర్శకత్వం వహించిన నవీన్ మేడారం.. '90స్' వెబ్ సిరీస్‌తో నిర్మాతగా వ్యవహరించారు. ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా చక్కటి ఎమోషన్స్, బాల్యం, ఎడ్యుకేషన్, మంచి మెసేజ్‌తో కూడిన '90s' మంచి సక్సెస్ అందుకుంది. ఆదిత్య హాసన్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించగా 'ఈటీవీ విన్' ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. పేరుకు తగ్గట్లుగానే ఈ సిరీస్ నిజంగా అందరినీ '90s' డేస్‌లోకి తీసుకెళ్లింది. 90sలో ఓ మధ్య తరగతి టీచర్ తన ముగ్గురు పిల్లల చదువు, కెరీర్‌కు సంబంధించి స్ట్రిక్ట్ రూల్స్, ఈ నేపథ్యంలో ఫస్ట్ లవ్, వారి స్నేహాన్ని ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కలిపి సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్‌ను చక్కగా చూపించారు. ఇప్పుడు అలాంటి స్టోరీ బ్యాక్ డ్రాప్‌లోనే 'హోమ్ టౌన్' సైతం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి లవ్, కోర్ట్ డ్రామా వరకూ.. ఈ వారం ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే మూవీస్, సిరీస్‌లు ఇవే!