Dolly D Cruze News: "ఇది అన్యాయం డాలీ. నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. నీతో ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు మాటలు రావడం లేదు" అని ప్రముఖ నటి సురేఖా వాణి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక పోస్ట్ చేశారు. ఎవరీ డాలీ? అని కొంతమంది ఆలోచించారు. ఆరా తీశారు. అయితే... రెగ్యులర్‌గా యూట్యూబ్‌లో తెలుగు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు చూసే వాళ్ళకు ఆమె సుపరిచితులే. డాలీ ఇక లేరు.


గచ్చిబౌలి, హైదరాబాద్‌లో జరిగిన రోడ్ యాక్సిడెంట్‌లో (Gachibowli Road Accident) డాలీ మరణించినట్టు తెలుస్తోంది. డాలీ అసలు పేరు డాలీ డి క్రూజ్ (Dolly D Cruze). గాయత్రి, గాయత్రి డాలీ స్క్రీన్ నేమ్స్‌తో యూట్యూబ్ ఫిల్మ్స్ చేశారు. డాలీతో పాటు కారు నడుపుతున్న రాథోడ్ అనే వ్యక్తి, మరొక మహిళ కూడా మరణించారు. మితిమీరిన వేగమే కారు ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం.


Also Read: Shreya Muralidhar - కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...


'బిగ్ బాస్' ఫేమ్ సిరి హనుమంతు నటించిన 'మేడమ్ సార్ మేడమ్ అంతే' వెబ్ సిరీస్‌లో శ్రీహన్ మీద మనసు పారేసుకునే అమ్మాయిగా, ఆఫీస్ కొలీగ్‌గా డాలీ నటించారు. 'జల్సారాయుడు' యూట్యూబ్ ఛానల్‌లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ఇంకా పలు ఫిల్మ్స్ చేశారు. నటి సురేఖా వాణి, ఆమె కుమార్తె సుప్రీతకు చాలా క్లోజ్. గతంలో సురేఖా వాణి ఫ్యామిలీతో కలిసి గోవా వెళ్లారు. పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. డాలీ మృతి పట్ల సురేఖా వాణి, సుప్రీత తదితరులు సంతాపం (RIP Dolly D Cruze) ప్రకటించారు. 


Also Read: 'స్టాండప్ రాహుల్' రివ్యూ: రాజ్ తరుణ్ సినిమా నిలబడిందా? కిందకు పడిందా?