తెలుగు నాట మంచి ప్రజాదరణతో దూసుకుపోతున్న షో ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌’.  ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వ‌హిస్తున్న ఈ షో మొదటి సీజన్ అద్భుతంగా సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం రెండో సీజన్ కొనసాగుతోంది. ఈ షోలో తన చక్కటి గొంతుతో సంగీత అభిమానులను అలరిస్తోంది చిన్నారి గాయని ప్రణతి. తన మధుర గానంతో ఇప్పటికే లక్షలాది మంది ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆమె పాటలకు మెగాస్టార్ చిరంజీవి సైతం మైమరచిపోయారు. తాజాగా ప్రణతి చిరంజీవిని కలిసింది.


ప్రణతిని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి


విశాఖపట్నానికి  చెందిన ప్రణతి తన అద్భుతమైన పాటలతో  అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు ఆడియన్స్‌ తో పాటు ఎందరో సినీ ప్రముఖులు ఈ చిన్నారిపై ఇప్పటికే ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా హైదరాబాద్ లోని తన నివాసానికి వెళ్లిన ప్రణతిని సాదరంగా ఆహ్వానించి, అభినందించారు చిరంజీవి. వాస్తవానికి ఎవరిలో టాలెంట్ ఉన్నా వారిని ప్రోత్సహించడంలో చిరంజీవి ముందుంటారు. ఇప్పటికీ ఎంతో మంది నటీనటులను ఆయన వెన్నుతట్టి ముందుకు నడిపించారు. అలాగే  ప్రణతిని ఇంటికి పిలిపించుకుని అన్నమాచార్య కీర్తనలు  పాడించుకున్నారు. చిరంజీవి దంపతులు ఆమెతో కాసేపు సరదాగా గడిపారు. ఆమె పాటలు విని ఆనందంలో మునిగిపోయారు. చిన్నారి ప్రణతి మున్ముందు సంగీతరంగంలో మరింత ముందుకు సాగాలని మెగాస్టార్ దంపతులకు ఆశీర్వదించారు.


చిరంజీవిని కలవడం తనకు దక్కిన గౌరవం- సింగర్ ప్రణతి


అటు మెగాస్టార్‌ ఫ్యామిలీని కలిసే అవకాశం దొరకడం పట్ల ప్రణతి సంతోషం వ్యక్తం చేసింది. చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని, ఇప్పుడు ఆయన ముందు పాటలు పాడటం ఎంతో గర్వంగా ఉందని చెప్పింది. చిరంజీవి దంపతులతో గడపడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించింది. రానున్న ఎపిసోడ్స్ లో మరింత చక్కగా పాడేందుకు చిరంజీవి ప్రోత్సాహం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ వేదికగా ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 2’  ప్రసారమవుతోంది. స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌, గాయకుడు కార్తిక్‌, గాయని గీతామాధురి ఈ షోలో జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.


Also Read : 'న్యూసెస్' వెబ్ సిరీస్ రివ్యూ : జర్నలిస్టులు డబ్బుకు దాసోహం అయితే?


ఇక ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరంజీవి ప్రస్తుతం ‘భోళా శంకర్’ చిత్రం షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా, చిరు సోదరి పాత్రలో మహానటి కీర్తి సురేష్ కనిపించనుంది. 2023 ఆగస్ట్ 11న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.  తమిళంలో బ్లాక్ బస్టర్  సాధించిన ‘వేదాళమ్’ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్‌ గా 'భోళా శంకర్' రూపొందుతోంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం చుట్టూ తిరిగే ఈ కథలో.. దర్శకుడు మెహర్ రమేష్ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు. ఒక పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా తీర్చిదిద్దుతున్నారు. 'భోళాశంకర్' చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైనెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో రఘు బాబు, రావు రమేష్, మురళి శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్నారు.  


Read Also: తెలుగు హెరిటేజ్ డేగా ఎన్టీఆర్ జయంతి, అమెరికాలో ఫ్రిస్కో మేయర్ కీలక ప్రకటన