Bhairavam OTT Platform: ఓటీటీలోకి మల్టీ స్టారర్ 'భైరవం' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
Bhairavam OTT Release: లేటెస్ట్ మల్టీ స్టారర్ 'భైరవం' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'జీ5'లో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.
Bhairavam OTT Platform: యంగ్ హీరోస్ మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'భైరవం'. మే 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Just In
ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'జీ5' సొంతం చేసుకోగా... ఈ నెల 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మంచు మనోజ్ ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. సాయి శ్రీనివాస్, నారా రోహిత్‌లతో యాక్షన్, ఎమోషన్స్‌తో ఎంటర్‌టైన్ చేశారు. నాంది, ఉగ్రం వంటి సూపర్ హిట్స్ అందించిన విజయ్ కనకమేడల 'భైరవం' సినిమాకు దర్శకత్వం వహించారు.
సినిమాలో సీనియర్ హీరోయిన్ జయసుధ కీలక పాత్ర పోషించారు. ఆమెతో పాటు అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లైలు హీరోయిన్లుగా నటించారు. అలాగే డైరెక్టర్ సందీప్ రాజ్, అజయ్, వెన్నెల కిశోర్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. తమిళ మూవీ 'గరుడన్'కు రీమేక్‌గా స్టోరీలో మార్పులు చేర్పులు చేసి 'భైరవం'ను తెరకెక్కించారు. ఈ మూవీని పెన్ స్టూడియోస్ అధినేత డా.జయంతి లాల్ గడా ప్రజెంట్ చేయగా... శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ప్రొడ్యూస్ చేశారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందించారు.
Also Read: 'ఆంధీ వచ్చేసింది' - పవన్ 'హరిహర వీరమల్లు'లో మోదీ డైలాగ్... పవర్ స్టార్ పవర్ అట్లుంటది మరి
స్టోరీ ఏంటంటే?
గ్రామంలో వారాహి అమ్మవారి ఆలయానికి రూ.కోట్లు విలువైన భూములుంటాయి. వీటిపై మంత్రి (శరత్ లోహితాశ్వ) కన్ను పడుతుంది. ఎలాగైనా ఆ ల్యాండ్ చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తుంటాడు. అయితే... ఆలయ భూములు, అమ్మవారి నగలకు వరద (నారా రోహిత్), గజపతి వర్మ (మంచు మనోజ్) రక్షణగా ఉంటారు. గుడికి, వీరికి పెద్ద దిక్కు నాగరత్నమ్మ (జయసుధ). ఆమె అనుకోకుండా చనిపోవడంతో ఆలయ ధర్మకర్తగా శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) ఎంపికవుతాడు. ఇతను ఇద్దరికీ నమ్మిన బంటు.
ఆలయం మీద మంత్రి కన్ను పడిందని తెలుసుకున్న వరద, గజపతి వర్మ ఏం చేశారు? మంత్రి బావమరిది నాగరాజు అలియాస్ థియేటర్ (అజయ్) వీరిద్దరి మధ్య ఎలా చిచ్చు పెట్టాడు? ప్రాణ స్నేహితులు బద్ద శత్రువుల్లా మారడానికి కారణం ఏంటి? ఇద్దరికీ నమ్మిన బంటైన శ్రీను ఎవరి వైపు నిలబడ్డాడు? మంత్రి దేవాలయ భూములు చేజిక్కించుకున్నాడా? శ్రీనుకు వెన్నెలకు సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.