Pawan Kalyan's Hari Hara Veera Mallu Trailer Huge Response: 'యే పవన్ నహీ హై... ఆంధీ హై'... 2024 ఎన్నికల్లో 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్‌తో జనసేనాని పవన్ ప్రభంజనానికి దేశ ప్రధాని మోదీ ఇచ్చి కాంప్లిమెంట్ ఇది. ఇప్పుడు అదే డైలాగ్ పవర్ స్టార్ 'హరిహర వీరమల్లు'లో వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో పవన్ మునుపెన్నడూ చూడని విధంగా... డిఫరెంట్ లుక్‌లో పవర్ ఫుల్ యోధుడిగా కనిపించనున్నారు. ఢిల్లీ సుల్తానుల నుంచి సనాతన ధర్మాన్ని రక్షించడానికి వస్తోన్న ఓ యోధుడు, మొఘల్ శక్తిని ధిక్కరించిన వీరుడు 'వీరమల్లు'గా పవన్ కళ్యాణ్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ క్రూరమైన ఔరంగ జేబు పాత్రలో అదరగొట్టగా... ఆయన పవన్‌ను 'ఆంధీ వచ్చేసింది' అంటూ తుపానుతో పోల్చడం వేరే లెవల్‌లో ఉంది. పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ డైలాగ్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
పవర్ ఫుల్ డైలాగ్స్... గూస్ బంప్స్
బానిస బతుకుల నుంచి అమాయక ప్రజలను కాపాడేందుకు వస్తోన్న యోధుడు. మొఘల్ సామ్రాజ్యంలో ప్రజలు పడుతున్న కష్టాలను చూసి బందిపోటుగా మారిన వీరుడు. ప్రజల పక్షాన నిలిచి అక్రమ పాలకులకు, వారి సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన ధీరుడు... 'వీరమల్లు'. చారిత్రక యోధుడిగా పవర్ ఫుల్‌గా కనిపించారు మన పవర్ స్టార్.
ముఖ్యంగా డైలాగ్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. లేటెస్ట్ పొలిటికల్ పంచ్ డైలాగ్స్‌ను అప్పటి చరిత్రకు ఏమాత్రం తీసిపోని విధంగా సింక్ అయ్యేలా గూస్ బంప్స్ తెప్పించాయి. 'ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం.' 'ఈ భూమ్మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దాన్ని కొట్టి తీసుకు రావడానికి తిరుగు లేని రామబాణం కావాలి.' డైలాగ్‌తో పవన్ గుర్రంపై ఇచ్చిన ఎంట్రీ మరో లెవల్‌కు తీసుకెళ్లింది. 'ఇప్పటివరకూ మేకలు తినే పులుల్ని చూసుంటారు. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు.' అనే పవన్ డైలాగ్ హైప్ రెండింతలు చేసింది.
బీజీఎం హైలైట్
ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ మూవీకే హైలైట్‌గా నిలిచింది. విజువల్స్, వీరమల్లు గంభీరమైన రూపం... భయం ఎరుగని వీరుడిగా పవర్ స్టార్ యాక్షన్ నభూతో నభవిష్యత్ అనేలా ఉంది. యుద్ధ సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌లో పవన్ మరింతగా ఆకట్టుకున్నారు. తన అద్భుతమైన అభినయం, ఆహార్యంతో వీరమల్లు పాత్రకు ప్రాణం పోశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ డైలాగ్స్ మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉన్నాయని అంటున్నారు.
ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎఎం రత్నం సమర్పణలో ఎ.దయాకరరావు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. క్రిష జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. ఔరంగజేబు రోల్‌లో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటించారు. అనుపమ్ ఖేర్, జిషు సేన్ గుప్తా, సత్యరాజ్, సునీల్, నాజర్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా మూవీ రిలీజ్ కానుంది.