Rashmika Mandanna Mysaa Movie Details: ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకెళ్తున్న స్టార్ హీరోయిన్ ఎవరు? అంటే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు రష్మిక మందన్న. 'యానిమల్', 'పుష్ప 2', 'ఛావా' ఇలా బ్లాక్ బస్టర్ హిట్లతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇటీవలే నేషనల్ క్రష్ లేటెస్ట్ మూవీ అనౌన్స్ చేశారు.
కొత్త ప్రాజెక్ట్ 'మైసా' మూవీలో వారియర్ లుక్‌లో అదరగొట్టారు రష్మిక. ఇప్పటివరకూ ఎన్నడూ లేని విధంగా రక్తంతో ముఖం, చేతిలో ఆయుధం, ముక్కుపుడకతో ఆమె లుక్ చూసిన అంతా షాక్ అయ్యారు. 'ధైర్యం ఆమె బలం... ఆమె గర్జన వినడానికి కాదు... భయపెట్టడానికి...' అంటూ ఇచ్చిన హైప్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
అసలేంటీ 'మైసా'
'మైసా' అనే టైటిల్ అనౌన్స్ చేయగానే అందరిలోనూ ఓ ఆసక్తి నెలకొంది. అసలు మైసా అంటే ఏంటి? రష్మిక లుక్‌కు ఈ పేరుకు సంబంధం ఏంటి? అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. 'మైసా' అనే పదం స్వీడిష్, అరబిక్, జపనీస్, జార్జియన్ భాషల మూలాల నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. 'మైసా' అంటే అమ్మ అని అర్థం. స్వేచ్ఛా ఆలోచనల నుంచి వచ్చిన ఓ సహజ నాయకురాలి రోల్ కోసం ఈ టైటిల్ ఫిక్స్ చేశారు.
వారియర్ మదర్‌గా...
ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో రష్మిక వారియర్ మదర్ రోల్‌లో కనిపించనున్నట్లు లుక్‌ను బట్టి తెలుస్తోంది. ఈ మూవీని అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తుండగా... రవీంద్ర పూలే దర్శకత్వం వహించారు. గోండు తెగల బ్యాక్ డ్రాప్ ప్రధానాంశంగా మూవీ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఆ తెగలకు అండగా ఓ వారియర్‌గా రష్మిక ఏం చేశారనేదే? 'మైసా' స్టోరీ అని టాక్ వినిపిస్తోంది. ఆ తెగల వారికి పవర్ ఫుల్ 'వారియర్ మదర్'గా ఉండనున్నందునే ఈ మూవీకి ఆ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో అజయ్, అనిల్ సయ్యపురెడ్డిలు 'మైసా' మూవీని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి వూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటికే ఫస్ట్ పోస్టర్‌తో భారీ హైప్ క్రియేట్ చేయగా... అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు రష్మిక లుక్ చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇటీవల 'కుబేర'తో బిగ్ సక్సెస్ అందుకున్న రష్మిక తన తర్వాత ప్రాజెక్టులు సైతం పర్‌ఫెక్ట్‌గా ఎంచుకుంటున్నారు. గత రెండేళ్లుగా వరుస హిట్లతో దూసుకెళ్తోన్న నేషనల్ క్రష్... ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. 'ది గర్ల్ ఫ్రెండ్', బాలీవుడ్ 'థామా' మూవీ చేస్తున్నారు. తాజాగా... 'మైసా' మూవీని అనౌన్స్ చేశారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కిస్తుండగా... రష్మిక రోల్, స్టోరీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ స్టోరీపై రెండేళ్లు వర్క్ చేసినట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు.