మాచో స్టార్ గోపీచంద్ (Gopichand) కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా పాన్ ఇండియా సినిమాకు పరమ శివుడిని గుర్తు చేసే క్రేజీ టైటిల్ ఖరారు చేశారని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్ . ఆ వివరాల్లోకి వెళితే...
గోపీచంద్ 33వ సినిమా 'శూల'!'ఘాజి', 'అంతరిక్షం'తో విమర్శకుల ప్రశంసలతో పాటు దేశభక్తి సినిమాలు కోరుకునే ప్రేక్షకుల అభినందనలు అందుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy). ఆయన దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకం మీద శ్రీనివాసా చిట్టూరి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కుమార్ సమర్పణలో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆ హిస్టారికల్ సినిమాకు 'శూల' అనే టైటిల్ ఖరారు చేశారట.
Gopichand 33rd movie title: గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఒక పోస్టర్, వీడియో గ్లింప్స్ విడుదల చేసింది. అందులో గోపీచంద్ లుక్ ఆడియన్స్ అందరికీ షాక్ ఇచ్చింది. పొడవాటి జుట్టు, నుదిటిపై వీర తిలకంతో కనిపించారు. మంచు కొండల్లో ఉన్నారు. సినిమాలో ఒక ప్రదేశానికి ప్రాముఖ్యం ఉందని, ఆ ప్రాంతం పేరు 'శూల' అని, అదే టైటిల్ అయ్యిందని సమాచారం. మరి ఆ మంచు కొండలు ఉన్న ప్రాంతం పేరు 'శూల'నా? లేదంటే మరొకటా? అనేది వెయిట్ చేస్తే తెలుస్తుంది. 'శూల' అంటే ముందుగా గుర్తుకు వచ్చేది శివుని చేతిలో త్రిశూలం. అమ్మవారి దేవాలయాల్లోనూ శూలాలు ఉంటాయి. మరి, సంకల్ప్ రెడ్డి ఏం ప్లాన్ చేశారో?
Also Read: ప్రభాస్ నుంచి అల్లు అర్జున్ దగ్గరకు... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'దిల్' రాజు సినిమా
'ఘాజి', 'అంతరిక్షం' తర్వాత సంకల్ప్ రెడ్డి మరోసారి దేశభక్తి సినిమా తీస్తున్నారు. మన దేశ చరిత్రలో మరిచిపోయిన ఒక కీలక ఘట్టాన్ని వెండితెరపైకి తీసుకు వస్తున్నారని, ఏడవ శతాబ్దం నేపథ్యంలోని ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఒక చారిత్రక ఘట్టాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నారని చిత్ర బృందం చెబుతోంది.