'తమ్ముడు' కంటే 'గేమ్ చేంజర్' వార్తల్లో ఎక్కువ నిలుస్తోంది. నిర్మాత 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ ఇంటర్వ్యూల తర్వాత నితిన్ సినిమా పక్కకు వెళ్ళింది. రామ్ చరణ్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ వార్తల్లోకి వచ్చింది. రామ్ చరణ్ హెల్ప్ చేయలేదని, కనీసం అతడి నుంచి ఫోన్ కూడా రాలేదని శిరీష్ కామెంట్ చేసిన తర్వాత మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాయ్ కాట్ ఎస్వీసీ అని ట్రెండ్ చేశారు. దాంతో శిరీష్ సారీ చెప్పడం తెలిసిన విషయాలే. అయితే ఈ కథలో ఇవాళ కొత్త అంశం తెరపైకి వచ్చింది.
'గేమ్ చేంజర్' నిర్మాతలు ఎవరు?ఇప్పుడు నష్టాలు భరిస్తున్నది ఎవరు?'గేమ్ చేంజర్' సినిమా పోస్టర్ చూస్తే... రెండు నిర్మాణ సంస్థల పేర్లు కనబడతాయి. దిల్ రాజు కుటుంబానికి చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఒకటి అయితే... జి నెట్వర్క్ సంస్థకు చెందిన జీ స్టూడియోస్ మరొకటి. దిల్ రాజు ప్రొడక్షన్స్ అని ఉన్నా అదీ దిల్ రాజు ఫ్యామిలీదే.
'గేమ్ చేంజర్' నిర్మాణం నుంచి మొదలు పెడితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు - ప్రచార కార్యక్రమాలు, విడుదల వరకు అన్నీ తానే వ్యవహరించారు 'దిల్' రాజు. శిరీష్ ఇంటర్వ్యూ కాంట్రవర్సీ అయ్యాక... 'సంక్రాంతికి వస్తున్నాం' నిర్మాణ బాధ్యతలు ఆయన చూసుకుంటే 'గేమ్ చేంజర్' నిర్మాణ బాధ్యతలు తాను చూసుకున్నట్లు 'దిల్' రాజు తెలిపారు. కొత్త కాంట్రవర్సీ ఏమిటంటే?
Also Read: ప్రభాస్ నుంచి అల్లు అర్జున్ దగ్గరకు... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'దిల్' రాజు సినిమా
'తమ్ముడు' విడుదల సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చిన 'దిల్ రాజును.... ''గేమ్ చేంజర్' తమ సినిమా అని జి స్టూడియోస్ అంటోంది?'' అని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించారు. అందుకు బదులుగా ''అయితే నష్టాలను వాళ్ళను భరించమని చెప్పండి'' అని 'దిల్' రాజు సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత 'గేమ్ చేంజర్' గురించి ఎటువంటి ప్రశ్నలూ వద్దని తెలిపారు. దాంతో ఇప్పుడు ఈ సినిమా అసలు నిర్మాత ఎవరు? అనే ప్రశ్న మొదల అవుతోంది. జీ స్టూడియోస్ పేరు పోస్టర్ మీద ఎందుకు పడిందో? వాళ్ళను భాగస్వామిగా ఎందుకు చేసుకున్నారో? అదొక్కటే క్లారిటీ లేని విషయం! 'గేమ్ చేంజర్' వివాదం వల్ల 'తమ్ముడు' అవుటాఫ్ పబ్లిసిటీ అయ్యింది.
Also Read: చిరంజీవి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా మహేష్ బాబు... అదీ ఒరిజినల్ ప్లాన్... తర్వాత ఏం జరిగిందంటే?
శిరీష్ ఇంటర్వ్యూ ఇస్తున్నట్లు తెలియదు!'తమ్ముడు' విడుదల సందర్భంగా శిరీష్ ఇచ్చిన ఇంటర్వ్యూ కాంట్రవర్సీకి కారణం కావడంతో దాని మీద 'దిల్' రాజు స్పందించారు. తమ కుటుంబం 30 ఏళ్ళ నుంచి చిత్రసీమలో ఉన్నప్పటికీ ఎప్పుడు శిరీష్ ఇంటర్వ్యూ ఇచ్చింది లేదని, ఆయన మీడియా ముందుకు రాడని 'దిల్' రాజు గుర్తు చేశారు. శిరీష్ ఇంటర్వ్యూ ఇస్తున్నట్లు తెలిస్తే ఆపేవాడినని లేదంటే ముందుగానే ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకునే వాడినని ఆయన పేర్కొన్నారు. దాన్ని పట్టుకుని డ్యామేజ్ చేయవద్దని రిక్వెస్ట్ చేశారు.