How Was Ramayana First Glimpse?: భారతీయ సంస్కృతిలో, సంప్రదాయాలలో రామాయణాన్ని వేరుచేసి చూడలేం. హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే ఆ సీతారాముల కథను వెండితెరపై ఇప్పటికే పదుల సంఖ్యలో దర్శక రచయితలు ఆవిష్కరించారు. ఇప్పుడు ఆ కథను 'రామాయణ'గా మరోసారి తీసుకు వస్తున్నారు దర్శకుడు నితేష్ తివారి.

Continues below advertisement

'రామాయణ' ఫస్ట్ గ్లింప్స్‌ ఎలా ఉందంటే?శ్రీరామ చంద్రుని పాత్రలో బాలీవుడ్ కథానాయకుడు రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి నటించిన సినిమా 'రామాయణ'. ఇందులో లంకాధిపతి రావణుడిగా యష్ నటించారు. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ రోజు ఫస్ట్ గ్లింప్స్‌ విడుదల చేశారు.

'రామాయణ' చిత్రీకరణ ప్రారంభించిన తర్వాత ముంబైలోని ఒక స్టూడియోలో షూట్ చేస్తున్నప్పుడు సెట్స్ నుంచి రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి ఫోటోలు లీక్ అయ్యాయి. ఫస్ట్ గ్లింప్స్‌లో వాళ్లిద్దరి లుక్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేస్తారని ఆశించారంతా! అయితే... అటువంటి ఏమీ లేదు. కేవలం ఈ సినిమా స్కేల్ ఎలా ఉంటుందో పరిచయం చేయడం కోసం యానిమేషన్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. యానిమేషన్ విజువల్స్ చాలా క్వాలిటీతో చేశారని 'రామాయణ' ఫస్ట్‌ గ్లింప్స్‌ చూస్తే అర్థం అవుతోంది. 

Continues below advertisement

సృష్టించేది బ్రహ్మ అయితే దానిని కాపాడేది విష్ణువు అని, ధ్వంసం చేసేది శివుడు అని... వాళ్ళ సృష్టికి విఘాతం కలిగినప్పుడు శ్రీరాముడు అవతరించినట్టు ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో చూపించారు. మూడు నిమిషాల విజువల్ మూవీ గ్రాండియర్ చూపెడుతోంది. గ్లింప్స్‌ చివరలో యష్, రణబీర్ లుక్స్ కాస్త చూపించారు. గ్లింప్స్‌లో ఇద్దరూ హైలైట్ అయ్యారు. యష్ పవర్ ఫుల్ లుక్ ఇస్తే... రణబీర్ ఛార్మ్ చూపించారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్స్ హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్‌లో నేపథ్య సంగీతం రిజిస్టర్ అయ్యేలా ఉంది. సినిమా మీద ఈ గ్లింప్స్ హైప్ పెంచుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 

Also Readప్రభాస్ నుంచి అల్లు అర్జున్ దగ్గరకు... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'దిల్' రాజు సినిమా

'రామాయణ'తో నిర్మాతగా మారిన యష్...వచ్చే ఏడాది దీపావళికి మొదటి పార్ట్ రిలీజ్!Ramayana Part 1 Release Date: నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణ' చిత్రాన్ని నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిది సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న వీఎఫ్ఎక్స్ స్టూడియో డీఎన్ఈజీ, యష్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్‌ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ సినిమాతో యష్ నిర్మాతగా మారుతున్నారు. రెండు భాగాలుగా 'రామాయణ' రూపొందుతోంది. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది (2026) దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయనున్నారు.

Ramayana Cast And Crew: సీతారాములుగా సాయి పల్లవి, రణబీర్ కపూర్ తెరపై కనిపించనున్న ఈ సినిమాలో రావణుడిగా యష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతునిగా బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్, మండోదరిగా కాజల్ అగర్వాల్ కనిపించనున్నారు. 

Also Read'గేమ్ చేంజర్' అసలు నిర్మాత ఎవరు? జీ స్టూడియోస్, 'దిల్' రాజు మధ్య ఏం జరిగింది? తెరపైకి కొత్త కాంట్రవర్సీ