తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో మరో వెబ్ సిరీస్ తెరకెక్కించింది జీ5 ఓటీటీ. అచ్చమైన, స్వచ్ఛమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో 'మోతెవరి లవ్ స్టోరీ' (Mothevari Love Story)ని వీక్షకుల ముందుకు తీసుకు వస్తోంది. ఆనంద్ దేవరకొండ ముఖ్య అతిథిగా నిర్వహించిన కార్యక్రమంలో ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు.

హీరోగా 'మై విలేజ్ షో' అనిల్!My Village Show Anil turns main lead with ZEE5 original series Mothevari Love Story: 'మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ యువకుడు అనిల్ జీలా. ఇంతకు ముందు కొన్ని సినిమాలు, సిరీస్‌లలో యాక్ట్ చేశారు. ఇప్పుడు 'మోతెవరి లవ్ స్టోరీ'లో హీరోగా నటించారు. ఇందులో ఆయన సరసన వర్షిణి రెడ్డి జున్నుతుల హీరోయిన్‌గా చేశారు. శివ కృష్ణ బుర్రా దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో మొత్తం ఏడు ఎపిసోడ్స్‌ ఉన్నాయి. గ్రామీణ నేపథ్యంలో వినోదం, ప్రేమ వంటి అంశాలు మేళవించి సిరీస్ తీశారు. ఓ పెళ్లి చుట్టూ జరిగే డ్రామా అందరినీ ఆకట్టుకుంటుందని 

'మోతెవరి లవ్ స్టోరీ' కథ ఏమిటి?జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడు?Mothevari Love Story Seires Streaming Date: ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా 'మోతెవరి లవ్ స్టోరీ' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆగస్టు 8వ తేదీ నుంచి సిరీస్ స్ట్రీమింగ్ కానుందని జీ5 సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

'మోతెవరి లవ్ స్టోరీ' కథ విషయానికి వస్తే... తెలంగాణాలో లంబాడిపల్లి అని ఒక ఊరు ఉంది. అందులో ఇద్దరు సోదరులు ఉన్నారు. స్వర్గస్తులైన తండ్రి ఐదు ఎకరాల భూమిని ఓ మహిళకు రాసిచ్చారు. ఆ ఊరిలోని సత్తయ్య కుమార్తె అనిత (వర్షిణి రెడ్డి జున్నుతుల), అనుమవ్వ మనవడు పార్షి (అనిల్ జీలా) రహస్యంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి సిద్ధమవుతున్నారు. వాళ్ల ప్రేమకు ఎన్ని ఇబ్బందులు - అడ్డంకులు వచ్చాయి? ఆ భూ వివాదం ఏమిటి? కుటుంబ గర్వం, వారసత్వం మధ్య ప్రేమ జంట ఏమైంది? వంటి అంశాలతో అందరినీ ఆకట్టుకునే విధంగా పలు మలుపులతో సిరీస్ తీశారు.

Also Readనయనతారకు కొత్త చిక్కులు... లీగల్ నోటీసులు పంపిన 'చంద్రముఖి' నిర్మాతలు... ఎందుకంటే?

'మోతెవరి లవ్ స్టోరీ' టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా కొత్తగా ఉన్నాయని ఆనంద్ దేవరకొండ తెలిపారు. తాను హీరోగా 'మధుర' శ్రీధర్ నిర్మించిన 'దొరసాని' కోసం తెలంగాణ యాసను 'మై విలేజ్ షో' యూట్యూబ్ ఫిలిమ్స్ చూసి నేర్చుకున్నానని ఆయన తెలిపారు. సిరీస్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'తో సంగీత్ శోభన్‌కు స్టార్‌డమ్‌ వచ్చిందని, అలాగే 'మోతెవరి లవ్ స్టోరీ'తో అనిల్ గీలాకు స్టార్‌డమ్ వస్తుందని 'జీ5' బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్ అన్నారు. 

Also Readక్యాస్టించ్‌ కౌచ్, డ్రగ్స్‌ ఇష్యూతో మాలీవుడ్‌ను కుదిపేసిన సినిమా... తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వారమే విడుదల!

తక్కువ నిర్మాణ వ్యయంలో 'మధుర' శ్రీధర్ గారు అద్భుతంగా 'మోతెవరి లవ్ స్టోరీ' సిరీస్ నిర్మించారని జీ5 కంటెంట్ హెడ్ దేశ్ రాజ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జీ5 వైస్ ప్రెసిడెంట్ జయంత్, అనిల్ గీలా, శివ కృష్ణ, శ్రీకాంత్ శ్రీరామ్, వర్షిణి రెడ్డి, గంగవ్వ, 'మధుర' శ్రీధర్, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.