Shine Tom Chacko and Vincy Aloshious Movie Soothravakyam Release Date: హేమ కమిటీ రిపోర్ట్ తర్వాత క్యాస్టింగ్ కౌచ్, డ్రగ్స్ ఆరోపణలతో మలయాళ చలన చిత్ర పరిశ్రమ వార్తల్లో మరోసారి నిలిచేలా చేసిన సినిమా 'సూత్ర వాక్యం'. తెలుగు సినిమాలు 'దసరా', 'దేవర', 'డాకు మహారాజ్' తదితర సినిమాల్లో నటించిన షైన్ టామ్ చాకో అందులో హీరో. అతనిపై ఆ సినిమాలో హీరోయిన్ విన్సీ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. డ్రగ్స్ తీసుకుని చిత్రీకరణకు వచ్చాడని బాంబు పేల్చింది. విన్సీకి మీడియా సాక్షిగా బేషరతు క్షమాపణ చెప్పి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాడు షైన్ టామ్ చాకో. ఇప్పుడీ సినిమా ప్రస్తావన ఎందుకంటే... తెలుగులోనూ విడుదలకు రెడీ అవుతోంది. 

జినీవెర్స్' ద్వారా 11న మలయాళ వెర్షన్ విడుదల!షైన్ టామ్ చాకో, విన్సీ హీరో హీరోయిన్లుగా నటించిన మలయాళ సినిమా 'సూత్ర వాక్యం'. ఈ నెల 11న జినీవెర్స్ సంస్థ విడుదల చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల్లో విడుదల చేస్తున్నామని, ఈ శుక్రవారమే ఏపీ - తెలంగాణలోని థియేటర్లలోకి కూడా తీసుకు వస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. తెలుగు వెర్షన్ ఈ నెలాఖరున విడుదల కానున్నట్లు వివరించారు. 

వాస్తవ సంఘటనల నేపథ్యంలో తీసిన 'సూత్ర వాక్యం'నిజ జీవిత సంఘటనలు, వాస్తవంగా జరిగిన అంశాల నేపథ్యంలో 'సూత్ర వాక్యం' తెరకెక్కించారు. కరోనా సమయంలో కేరళలో విదుర పోలీస్ స్టేషన్ సిబ్బంది కొత్త అధ్యాయానికి తెర తీసింది. యువతలో ధైర్యాన్ని నింపి, వారి కలలు - ఆశయాలు పునరుత్తేజం అయ్యేందుకు కౌన్సిలింగ్ చేపట్టింది. ఆ కార్యక్రమాల స్పూర్తితో తీసిన చిత్రమే 'సూత్ర వాక్యం'.

Also Read: నయనతారకు కొత్త చిక్కులు... లీగల్ నోటీసులు పంపిన 'చంద్రముఖి' నిర్మాతలు... ఎందుకంటే?

'సూత్ర వాక్యం' కథ విషయానికి వస్తే... పోలీస్ స్టేషన్లకు నేరస్తులు, నేరాలకు బలైన బాధితులు మాత్రమే ఎందుకు వెళ్ళాలి? ఖాళీ సమయాల్లో పిల్లలకు పోలీసు సిబ్బంది ఎందుకు పాఠాలు చెప్పకూడదు? పోలీసుల్ని చూసి సామాన్య ప్రజలు భయపడే సంస్కృతి ఇంకెన్నాళ్లు? వంటి విప్లవాత్మకమైన ఆలోచనకు వినోదం జోడించి చిత్రాన్ని తెరకెక్కించారమని నిర్మాతలు, 'సినిమా బండి' ఫేమ్ కాండ్రేగుల లావణ్యా దేవి - కాండ్రేగుల శ్రీకాంత్ తెలిపారు. ఈ సినిమా నిర్మించే అవకాశం రావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

Also Readఅపార్ట్‌మెంట్‌లో హీరోయిన్ అనుమాస్పద మృతి...

Soothravakyam Movie Cast And Crew: 'సూత్ర వాక్యం' సినిమాతో యూజియాన్ జాస్ చిరమ్మల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై కాండ్రేగుల లావణ్యా దేవి సమర్పణలో కాండ్రేగుల శ్రీకాంత్ ప్రొడ్యూస్ చేశారు. షైన్ టామ్ చాకో, విన్సీ ఆలోషియస్ జంటగా నటించిన ఈ సినిమాలో దీపక్ పరంబోర్, మీనాక్షి మాధవి, దివ్య ఎం. నాయర్ ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమాలో నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల ముఖ్యమైన పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: రెజిన్ ఎస్.బాబు, సినిమాటోగ్రఫీ; శ్రీరామ్ చంద్రశేఖరన్, సంగీతం: జీన్ పి.జాన్సన్, ఎడిటింగ్: నితిన్ కె.టి.ఆర్.