ఫోటో చూశారా? అందులో ఉన్న మహిళ పేరు హుమైరా అస్గర్. పాకిస్తానీ నటి. ఆమె మోడల్ కూడా! కరాచీలో నివాసం ఉంటున్నారు. అనుమానాస్పద రీతిలో ఆవిడ మరణించారు. హుమైరా ఫ్లాట్ నుంచి దుర్వాసన వచ్చేవరకు ఆవిడ గురించి ఎవరికీ తెలియదు. అసలు వివరాల్లోకి వెళితే...
సహజ మరణమా? మరొకటా?కరాచీలోని ఇత్తెహాద్ కమర్షియల్ ఏరియా ఫేజ్ 6లో హుమైరా (Humaira Asghar) నివాసం ఉంటున్నారు. సుమారు ఏడేళ్లుగా అక్కడ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో ఒక్కరే జీవిస్తున్నారు. హుమైరా ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడం, కొన్ని రోజులుగా ఆవిడ కనిపించకపోవడంతో మంగళవారం ఇరుగు పొరుగు జనాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హుమైరా ఫ్లాట్ డోర్ బద్దలుకొట్టి చూసిన పోలీసులకు కుళ్ళిన శవం కనిపించింది. ఆ మహిళ వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉంటుందని, అది హుమైరా శవం అని తెలిపారు. పోస్టు మార్టం రిపోర్టు కోసం ప్రభుత్వ ఆస్పత్రికి బాడీని పంపించారు. సహజ మరణంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: అమెరికా వీధుల్లో చెట్టాపట్టాల్... తెరపైకి మళ్లీ సమంత డేటింగ్ వ్యవహారం
కరాచీ డీఐజీ రజా మాట్లాడుతూ... ''హుమైరా బాడీని చూస్తే ఆవిడ మరణించి కొన్ని రోజులు అవుతున్నట్టు తెలుస్తోంది. ఎవిడెన్స్ కోసం ఫోరెన్సిక్ టీంను హుమైరా ఇంటికి పంపించాం'' అని చెప్పారు. బాడీ కాస్త కుళ్లిపోవడంతో హుమైరా మరణానికి కారణం ఏమిటనేది ఇప్పుడే చెప్పలేమని, మరింత అనాలసిస్ చేయాలని జిన్నా ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
Also Read: మలయాళంలో బిగ్గెస్ట్ హిట్ 'మంజుమ్మేల్ బాయ్స్' నిర్మాతల అరెస్ట్, బెయిల్ మీద విడుదల... అసలు ఏమైందంటే?