నయనతారను వివాదాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. విజయాలతో పాటు ఎప్పటికప్పుడు ఏదొక కొత్త కాంట్రవర్సీ ఆవిడను వెంటాడుతోంది. మరీ ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌ కోసం రూపొందించిన తన 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' లీగల్ నోటీసులు ఎదుర్కొంటోంది. ఆ డాక్యుమెంటరీ తన అనుమతి లేకుండా 'నానుమ్ రౌడీ దాన్' ఫుటేజ్ వాడినందుకు ధనుష్ గతంలో నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు ఆయనే నిర్మాత. తాజాగా 'చంద్రముఖి' నిర్మాతలు నోటీసులు పంపారు. 

అనుమతి లేదు, ఫుటేజ్ వాడారు...ఇప్పుడు మాకు ఐదు కోట్లు కట్టండి!'చంద్రముఖి'లో జ్యోతిక టైటిల్ రోల్ చేయగా... సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్ రోల్ చేశారు. ఆ సినిమా 2005లో థియేటర్లలోకి వచ్చింది. భారీ విజయం సాధించింది. తన డాక్యుమెంటరీలో నయన్ ఆ సినిమా ఫుటేజ్ వాడారు. తమ అనుమతి లేకుండా తమ సినిమా ఫుటేజ్ వాడారని ఏపీ ఇంటర్నేషనల్ సంస్థ మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కింది.

నయనతారతో పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సంస్థకు మద్రాస్ హైకోర్టు లీగల్ నోటీసులు పంపింది. నిజానికి 'చంద్రముఖి' సినిమాను శివాజీ ప్రొడక్షన్స్ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. వాళ్ళ దగ్గర నుంచి ఏపీ ఇంటర్నేషనల్ రైట్స్ కొనుగోలు చేసింది. వాళ్ళ ఫిర్యాదుతో మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అందులో తమకు నష్ట పరిహారంగా ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది ఏపీ ఇంటర్నేషనల్ సంస్థ. అంతే కాకుండా డాక్యుమెంటరీలో 'చంద్రముఖి' ఫుటేజ్ డిలీట్ చేయాలని కోరింది.

Also Read: అపార్ట్‌మెంట్‌లో హీరోయిన్ అనుమాస్పద మృతి...

'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీ గత ఏడాది (2024)లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల అయ్యింది. అందులో నయనతార పర్సనల్ జర్నీతో పాటు ప్రొఫెషనల్ జర్నీ కూడా చూపించారు. అలాగే, నయన్ - విఘ్నేష్ శివన్ పెళ్లిని హైలైట్ చేశారు. కవల పిల్లల గురించి చెప్పారు. ధనుష్ తర్వాత మరో నిర్మాణ సంస్థ నుంచి నోటీసులు రావడంతో నయనతార ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Readఅమెరికా వీధుల్లో చెట్టాపట్టాల్... తెరపైకి మళ్లీ సమంత డేటింగ్ వ్యవహారం