'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) బాక్సాఫీస్ బరిలో భారీ విజయాలు అందుకున్నారు. యూత్, ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేశారు. ఇప్పుడు ఆ చిత్ర నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యతో మరో సినిమా చేస్తున్నారు. హీరో - నిర్మాతల కలయికలో రూపొందుతున్న మూడో సినిమాకు 'బ్యాడాస్' (Badass) టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
రవికాంత్ పేరెపు దర్శకత్వంలో 'బ్యాడాస్'
Siddu Jonnalagadda and Ravikanth Perepu Second Movie: 'కృష్ణ అండ్ హిజ్ లీల' సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్ పేరెపు విజయం అందుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరి కలయికలో 'బ్యాడాస్' రూపొందుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
చేతిలో సిగరెట్... చుట్టూ మీడియా కెమెరాలు, మైకులు... ఫస్ట్ లుక్ చూడగానే ఒక క్యూరియాసిటీ కలిగించే విధంగా ఉంది. 'మీరు హీరోలను చూశారు. విలన్లను చూశారు. మీరు ఇతని మీద ఒక లేబుల్ వేయడానికి (హీరో, విలన్ అని చెప్పడానికి) కుదరదు. ఈసారి జాలి, దయ లేవు. స్క్రీన్ మీద స్టార్ బాయ్ ఫైర్ చూపిస్తాడు'' అని సితార సంస్థ పేర్కొంది. 'If middle finger was a man' అంటూ హీరో క్యారెక్టర్ గురించి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు.
Also Read: అమెరికా వీధుల్లో చెట్టాపట్టాల్... తెరపైకి మళ్లీ సమంత డేటింగ్ వ్యవహారం
సిద్ధు జొన్నలగడ్డలో మంచి నటుడు మాత్రమే కాదు... ప్రతిభ గల రచయిత కూడా ఉన్నాడనే విషయం తెలిసిందే. 'బ్యాడాస్'కు దర్శకుడు రవికాంత్ పేరేపుతో పాటు ఆయన కూడా రచయితగా వ్యవహరిస్తున్నారు. బలమైన కథ, భారీ నిర్మాణ వ్యయంతో రూపొందుతోన్న 'బ్యాడాస్' సినిమాను వచ్చే ఏడాది థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.
Also Read: మలయాళంలో బిగ్గెస్ట్ హిట్ 'మంజుమ్మేల్ బాయ్స్' నిర్మాతల అరెస్ట్, బెయిల్ మీద విడుదల... అసలు ఏమైందంటే?