బాలీవుడ్ నటి ఆలియా భట్ (Alia Bhatt) తెలుసు ప్రేక్షకులకూ తెలుసు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటించారు. ఆవిడను ఒకరు మోసం చేశారు. ఆలియా దగ్గర గతంలో పని చేసిన మేనేజర్ వేదిక శెట్టి డబ్బులు కొట్టేశారు. స్టార్ హీరోయిన్ సంతకాలు ఫోర్జరీ చేసి రూ. 77 లక్షల మోసానికి పాల్పడ్డారు. ఆ కేసులో జుహు పోలీసులు వేదిక శెట్టిని అరెస్టు చేశారు. శెట్టిపై ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆలియా తల్లి సోనీ రజ్దాన్ ఫిర్యాదు చేశారు. 

Continues below advertisement


కంప్లైంట్ ఇచ్చిన ఐదు నెలలకు
వేదిక శెట్టి మీద ఆలియా భట్ తల్లి సోనీ కంప్లైంట్ ఇచ్చి దాదాపు ఐదు నెలలు అవుతోంది. ఇప్పుడు అరెస్టు జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఆలియా భట్ సంతకాలను వేదిక ఫోర్జరీ చేసి, రెండు సంవత్సరాల కాలంలో డబ్బులు దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మోసంలో రూ. 77 లక్షల మేర అనధికార లావాదేవీలు జరిగినట్లు సమాచారం.


Also Readఅమెరికా వీధుల్లో చెట్టాపట్టాల్... తెరపైకి మళ్లీ సమంత డేటింగ్ వ్యవహారం


బెంగళూరులో వేదిక శెట్టిని గుర్తించిన పోలీసులు... అరెస్టు చేసి, ముంబైలోని కోర్టులో హాజరు పరిచారు. సోనీ రజ్దాన్ ఐదు నెలల క్రితం ఫిర్యాదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అప్పటి నుంచి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వేదిక ఒక్కరే మోసం చేశారా? లేదంటే ఇందులో ఇతరుల హస్తం కూడా ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.


Also Readమలయాళంలో బిగ్గెస్ట్ హిట్ 'మంజుమ్మేల్ బాయ్స్' నిర్మాతల అరెస్ట్, బెయిల్‌ మీద విడుదల... అసలు ఏమైందంటే?