Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ ఇక ఆఫీస్‌లో ఉండదు అని అంబిక చాలా సంతోషపడుతుంది. అంబిక సహస్రతో ఇంటికి వెళ్దామని లక్ష్మీకి ఇంటికి వెళ్తే మీ అమ్మ చేతిలో ఉంటుందని అంటుంది. లక్ష్మీ వెళ్తుంటే దారిలో విహారి కారు ఆపి లక్ష్మీని కారు ఎక్కమని అంటాడు. లక్ష్మీ విహారితో పాటు ఇంటికి వెళ్తుంది. 

పద్మాక్షి చాలా కోపంగా ఉంటుంది. అంబిక, సహస్ర రాగానే ఏంటి అంబిక ఏం జరుగుతుంది.. వంద కోట్లు పోవడం ఏంటి అని అంటుంది. దానికి అంబిక ఉండాల్సిన దాన్ని ఉండాల్సిన స్థానంలో ఉంచకుండా అందలం ఎక్కిస్తే ఇంతే అంటుంది. లక్ష్మీ, విహారి ఇంట్లోకి వస్తారు. పద్మాక్షి లక్ష్మీ జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి కింద పడేస్తుంది. వసుధ పైకి లేపి ఏంటి అక్కా ఇది అంటే పద్మాక్షి ఆపమని ఈ అండ ఆపమని అంటుంది. మీ అందరి అండ చూసి అది ఇలా మారిందని అంటుంది. 

పద్మాక్షి లక్ష్మీని వంద కోట్ల గురించి అడుగుతుంది. అంబిక, సహస్ర కూడా అడుగుతారు. విహారి చూస్తూ ఉంటాడు. పద్మాక్షి లక్ష్మీని కొడుతుంది. డబ్బు గురించి అడుగుతుంది. లక్ష్మీని పద్మాక్షి ఇంక కొట్టబోతే విహారి ఆపుతాడు. తనేం మన కళ్లు కప్పి వెళ్లలేదు అని అంటాడు. చారుకేశవ కలుగజేసుకొని వంద కోట్లు తీసుకొనే తెలివే ఉంటే ఇలా ఇంటికి ఎందుకు వస్తుంది అని అంటే అలా వస్తే కదా దీని మీద అనుమానం రాదని ఇలా ప్లాన్ చేసిందని అంటారు. ఇదంతా సైబర్ నేరం అని విహారి అంటే దీన్ని ఒక్క పది నిమిషాలు నాకు అప్పగిస్తే మొత్తం కక్కిస్తా అని పద్మాక్షి అంటుంది. వసుధ ఆపుతుంది. 

సహస్ర, అంబికలు ఇంటికి పోలీసులు వస్తున్నారు పరువు పోతుందని అంటారు. చారుకేశవ లక్ష్మీ అలా చేయదు ఎందుకు తనని ఇంతలా ఇబ్బంది పెడతారు అని అంటాడు. లక్ష్మీ భజన ఆపమని అంటారు. ఆ వంద కోట్లు ఎలా కడతావ్ అని విహారిని పద్మాక్షి అంటుంది. నేనే కడతాను అని విహారి అంటాడు. అంబిక విహారి మన ఆస్తులు అమ్మేస్తాడు అని అంటుంది. దానికి విహారి అత్తయ్య అది నా ఒక్కడి ఆస్తి కాదు మన అందరి ఆస్తి అంటాడు. పద్మాక్షి తమ కంపెనీల నుంచి ఆ వంద కోట్లు ఇస్తాను అంటే విహారి వద్దని తాను మొదటి నుంచి ఎదుగుతానని అంటాడు. తన ఫ్రెండ్ ఎస్‌ఐకి కాల్ చేసి విషయం చెప్తాడు. 

లక్ష్మీ ఇంట్లో అందరికీ దండం పెట్టి నాకు మీరు మీ ఇంట్లో వాళ్లు చాలా సాయం చేశారు నేను ఇలాంటి తప్పు చేయను అని అంటుంది. రెండు మూడు రోజుల్లో డబ్బు రికవరీ అవ్వాలి లేదంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని పద్మాక్షి చెప్తుంది. లక్ష్మీని వసుధ, చారుకేశవ ఓదార్చుతారు. విహారి టెన్షన్‌గా ఉంటాడు. సహస్ర విహారినే చూస్తుంది. ఇంతలో మేనేజర్‌కి కాల్ చేసి ఇలా ఎప్పుడు జరగలేదు.. బ్యాంక్ వాళ్లు .. ఇన్వెస్టర్లు కోప్పడుతున్నారని అంటాడు. విహారి సహస్రతో ఒక్క రోజులో మన కంపెనీ పేరు పరువు అంతా పోయిందని అంటాడు. సహస్ర ఇది తన వల్లే జరిగింది అని తెలిస్తే బావ ఏం అంటాడో అని బాధ పడుతుంది. పద్మాక్షికి అడిగి సాయం చేస్తా అంటే విహారి వద్దు సహస్ర మనమే ఏదో చేద్దాం అంటాడు. 

లక్ష్మీ ఏడుస్తుంటే చారుకేశవ,వసుధ లక్ష్మీ దగ్గరకు వెళ్తారు. బాధ పడొద్దని అంటారు. ఇంతలో లక్ష్మీకి తల్లిదండ్రులు కాల్ చేస్తారు. లక్ష్మీ మాట్లాడుతుంటే తండ్రికి డౌట్ వస్తుంది. ఏమైంది అమ్మా ఏమైనా గొడవ అయిందా అని అడుగుతాడు. ఏం లేదని లక్ష్మీ అంటుంది. ఆదికేశవ్ కూతురితో త్వరలో మీ పెళ్లి అయి సంవత్సరం కానుంది కదా మీరు మాతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటారు. తన వల్లే ఇంటి సంతోషం పోయిందని లక్ష్మీ ఏడుస్తుంది. ఇంతలో విహారి అక్కడికి వస్తాడు. లక్ష్మీ విహారితో నా వల్ల మీకు మీ కుటుంబానికి చాలా పెద్ద నష్టం జరిగింది ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: 100 కోట్ల స్కామ్‌లో లక్ష్మీ.. సస్పెండ్ చేసిన విహారి..!