Meghasandesam Serial Today Episode: భూమి గగన్‌ల పెళ్లికి అంతా సిద్దం అయి ఉంటుంది. గగన్ మండపంలో కూర్చుని ఉండగా పంతులు మంత్రాలు చదువుతుంటాడు. చుట్టాలు, బంధువులు పెళ్లి వస్తుంటారు. ఇంతలో పెళ్లి కూతురును తీసుకురమ్మని పంతులు చెప్తాడు. సుజాత వెళ్లి రూంలోంచి కంగారుగా వస్తుంది.
సుజాత: అమ్మాయి పెళ్లి కూతురు కనబడటం లేదు. అవును గదిలో పెళ్లి కూతురు లేదమ్మాయి..
అందరూ షాక్ అవుతారు. నక్షత్ర, అపూర్వ నవ్వుకుంటారు.
కేపీ: కనిపించకపోవడం ఏంటండి అందరిని కంగారు పెట్టకండి..
సుజాత: లేదు నేను అంతా చూశాను.
కేపీ: వెళ్లి అంతా వెతకండి.. వెళ్లండి..
సుజాత: లేదు అని చెప్తున్నాను కదా..?
కేపీ, చెర్రి భూమిని వెతుక్కుంటూ వెళ్తారు. అందరూ అయోమయంగా చూస్తుంటారు. శరత్‌చంద్ర చిన్నగా నవ్వుకుంటాడు. గగన్ షాకింగ్‌గా చూస్తుంటాడు. కేపీ, చెర్రి మొత్తం వెతికి మండపంలోకి వస్తారు.
కేపీ: భూమి నిజంగానే కనిపించడం లేదు.
ముత్తైదువ: అనుకున్నాను నేను ముందే అనుకున్నాను. మగ దిక్కు లేని ఇంటికి ఏ ఆడపిల్ల కోడలుగా వెళ్తుందా అని ముందే అనుకున్నాను. అది శరత్‌చంద్ర గారి ఇంటి నుంచి ఈ ఇంటి కోడలిగా వెళ్లడం ఏంటని ముందే అనుకున్నాను. అనుకున్నదే అయింది.
కేపీ: ఏవండి ఇంక ఆపండి..
శరత్: వాళ్లను ఆపే రైట్ మనకు లేదు. ఎందుకంటే వాళ్ల కుటుంబం అలాంటిది.
ముత్తైదువ: బాగా చెప్పారండి ఈ పెళ్లి జరగదని నాకు మొదటి నుంచే అనిపిస్తుంది. చివరి నిమిషంలో ఈ ఇంటికి నేను కోడలు ఏంటని భూమి వెళ్లిపోయినట్టు ఉంది.
వ్యక్తి: అట్టర్ ప్లాప్ సినిమాకు బ్లాక్‌లో టికెట్లు కొనుక్కుని వచ్చినట్టు ఉంది మన పరిస్థితి. ఇంకెందుకు టైం వేస్ట్ వెళ్దాం పదండి. లేవండి.. వెళ్దాం..
గగన్: ఆగండి.. ఈ పెళ్లి ఆగిపోయిందని మీకు మీరే నిర్దారించుకుని వెళ్లిపోకండి. భూమితో నా పెళ్లి జరుగుతుంది.
అంటూ గగన్ కరాకండిగా చెప్పగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. శారద ఏడుస్తుంది. మరోవైపు డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొనేందుకు వెళ్లిన భూమి తన చాన్స్ కోసం ఎదురుచూస్తుంది. చివరి రౌండ్‌లో భూమి ప్రదర్శన చాలా గొప్పగా చేస్తుంది. భూమి డాన్స్ కాంపిటీషన్‌కు రావడంతో కావ్య షాక్ అవుతుంది. అపూర్వ చెప్పింది గుర్తు చేసుకుని కోపంతో ఊగిపోతుంది. ఇప్పుడెలాగైనా భూమిని గెలవకుండా చేయాలని కుట్రలు చేయాలని చూస్తుంది. కానీ కాంపిటీషన్‌లో భూమి డాన్స్ చేస్తుంది. భూమి డాన్స్ జడ్జీలే కాదు. ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడతారు. భూమి డాన్స్ చేశాక ఫైనల్ రౌండ్ ముగిసిందని భూమిని విజేతగా ప్రకటిస్తారు. మొదటి బహుమతి తీసుకుని భూమి నేరుగా పెళ్లి మండపానికి వస్తుంది. అప్పటి దాకా మండపంలోనే అందరూ వెయిట్ చేస్తుంటారు.
చెర్రి: అదిగో భూమి వస్తుంది.
గగన్ ఏడుస్తూ వెళ్లి భూమిని హగ్ చేసుకుంటాడు.
గగన్: నా భూమి వచ్చింది చూడండి.. మా ప్రేమ నిజం అని నిరూపిస్తూ భూమి వచ్చింది. థాంక్స్ భూమి
అంటూ హగ్ చేసుకుంటాడు. వెంటనే రెడీ అయి రమ్మని భూమికి చెప్తాడు. భూమి రూంలోకి వెళ్తుంది. గగన్ వెళ్లి పెళ్లిపీటల మీద కూర్చుంటాడు. మొదలుపెట్టినప్పటి నుంచి ఈ పెళ్లి ఆగిపోతుందనుకుని ఆనందించిన అందరూ మా పెళ్ళిని చూడండి అంటాడు. ఇంతలో భూమి మండపంలోకి వస్తుంది. గగన్ తాళికట్టబోతుంటే.. ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!