Jagadhatri Serial Today Episode డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ నిజం కాదు బాబు కౌషికి కొడుకే అని జగద్ధాత్రి, కేథార్ అంటారు. కౌషికి బాబాయ్‌ కూడా వీడు ఈ ఇంటి వారసుడో కాదో తేల్చడానికి ఈ కాగితం ముక్క సరిపోదు. అయినా తల్లికి బిడ్డ ఎవరో తెలీదా అని అంటారు. ఆదిలక్ష్మీ సురేశ్‌తో ఏంటి సురేశ్ నువ్వేం చెప్పవా అంటే దానికి సురేశ్ నా భార్య డెలివరీలో ప్రమాదం జరిగితే నేను పక్కన లేను.. ఇప్పుడు చెప్పే హక్కు నాకు లేదు.. నా భార్య ఏం చెప్తే అదే నాకు నిజం అని సురేశ్ అంటాడు.

సురేశ్ మాటలకు ఆదిలక్ష్మీ కోపంతో అయితే నా శవానికి నిప్పు పెట్టడానికి రెడీగా ఉండు అంటుంది. కౌషికి అత్తతో ఎందుకు నన్ను నమ్మకుండా ఆ కాగితం నమ్ముతున్నారని అడుగుతుంది. ఆ బిడ్డ నీ బిడ్డ కాదు వెళ్లి అనాథాశ్రమంలో చేర్పించు అని ఆదిలక్ష్మీ చెప్తుంది. జగద్ధాత్రి అందరితో రిపోర్ట్‌లో ఏదో తప్పు ఉంది మనం ఇంకో ల్యాబ్‌లో టెస్ట్ చేయిద్దామని అంటుంది.  అక్కడ కూడా ఇలాగే వస్తే ఏంటి అని నిషిక అడిగితే ఆదిలక్ష్మీ అనాథాశ్రమంలో వదిలేయాలి అని అంటుంది. అలా కుదరదు అంటే ఆ బిడ్డకు నా కొడుకు సురేశ్‌కి ఏం సంబంధం లేదని రాసివ్వాలని చెప్తుంది. సురేశ్ తల్లితో ఏం మాట్లాడుతున్నావ్ అమ్మా అంటే నా పంతం నీకు తెలుసు చచ్చిపోతా అంటుంది. కౌషికి మరో టెస్ట్‌కి ఒప్పుకుంటుంది. 

యువరాజ్ ల్యాబ్ అసిస్టెంట్‌కి డబ్బు ఇస్తాడు. నిజం ఎప్పటికీ ఎవరికీ తెలీకూడదు అని అంటాడు. ఒక్క రిపోర్ట్‌తో అందరి మనసులో అనుమానం పెంచానని యువరాజ్ తల్లి, భార్యతో చెప్తాడు. జగద్ధాత్రి ఎన్ని టెస్ట్‌ల్‌ చేసినా అందర్ని కొనేస్తానని యువరాజ్ అంటాడు. జగద్ధాత్రి, కేథార్ ఎవరో కావాలనే చేశారని ఇది కచ్చితంగా ఇంట్లో వాళ్ల పనే అని అనుకుంటారు. ఇంకో టెస్ట్ తారుమారు చేయకుండా సక్రమంగా జరిగేలా చూడాలని అనుకుంటారు. ఇంతలో జగద్ధాత్రికి సాధుసార్ కాల్ చేస్తారు. ఊరు అవతల క్యాబ్‌ కాలిపోయింది.. డ్రైవర్ సజీవదహనం అయ్యాడని అంతా గందరగోళంగా ఉందని అది ఎలా జరిగిందో కనిపెట్టాలని అంటారు. 

జగద్ధాత్రి, కేథార్‌లు స్పాట్‌కి వెళ్తారు. మొత్తం పరిశీలించి అది యాక్సిడెంట్‌ కాదని ఎవరో కావాలని చంపారని డ్రైవర్‌ కూడా ముందే చనిపోవడంతో అలా కాల్చేశారని అనుకుంటారు.  బ్యాగ్స్ ఉన్నట్లు గమనించి ఎయిర్పోర్ట్‌కి వెళ్లిన వాళ్లని కిడ్నాప్‌ చేసుంటారని డ్రైవర్ చెప్పేస్తాడని చంపేసుంటారని ఎంక్వైరీ మొదలు పెడతారు. కేసు విషయంలో వెళ్తూ వెళ్తూ యామిని ఆత్మహత్య చేసుకోవడానికి ఓ బిల్డింగ్‌ మీదకు వెళ్లడం చూస్తారు. ఇద్దరూ పరుగులు తీస్తూ చెరోవైపు పరుగులు తీస్తారు. జగద్ధాత్రి యామినిని పిలుస్తుంది. దగ్గరకు వస్తే దూకేస్తానని అంటుంది. నేను మీకు తెలుసా జేడీ అని యామని అంటే మీరు జగద్ధాత్రి వాళ్ల అత్త కూతురు కదా నాకు తెలుసు అని జేడీ అంటుంది. ఇక కేథార్ చాటుగా వెళ్లి జగద్ధాత్రిని పక్కకు తీసుకొస్తాడు.

యామిని చచ్చిపోతా అని గోల చేస్తే జేడీ కొడుతుంది. ప్రాబ్లమ్ అడుగుతారు. బాబ్ ఒత్తిడి ఎక్కువ అయింది సంతోషంగా ఉండలేకపోతున్నా అని యామిని అంటుంది. యామిని వాళ్ల అమ్మ వాళ్లకి కాల్ చేస్తానని అంటే యామని కాశీ వెళ్లారని చెప్తుంది. ఇంతలో రమ్య కాల్ చేసి జేడీతో క్యాబ్ బుక్ చేసింది యామిని అని మీ నాన్న వాళ్లు వారణాసి వెళ్లారని వాళ్ల పేరు మీద ఫ్లైట్ టికెట్స్ బుక్ అయ్యాయని అంటుంది. జేడీ నిజం అడగటంతో యామిని మొత్తం చెప్తుంది. యామినిని మీనన్ ఆపి యామినితో నేను నీకు చిన్ని ప్యాకెట్ ఇస్తా నువ్వు ఫ్లైట్‌లో ఇవ్వాలి అంటాడు. యామిని చంపినా ఆ పని చేయను అంటుంది. దాంతో మీ మామయ్య, అత్తయ్యని అమ్మని నిషి, జగద్ధాత్రిని జగద్ధాత్రి చెల్లిని చంపేస్తా అని అంటాడు. దాంతో జేడీ, కేడీలు మీనన్ చనిపోయాడని మనల్ని నమ్మించాడు. ఇప్పుడు ఫ్లైట్ హైజాక్‌ చేయడానికా అని అనుకుంటారు. 

యామిని జేడీ, కేడీలతో అందుకే అమ్మావాళ్లకి కాశీ పంపాలని అనుకున్నా అంటుంది. దాంతో జేడీ కేడీలు అందుకేనా వాళ్లని కిడ్నాప్ చేసి డ్రైవర్‌ని చంపేశాడని అనుకుంటారు. జగద్ధాత్రి తండ్రి, పిన్ని అత్తల్ని మీనన్ రోడ్డు మీద ఆపి డ్రైవర్‌ని చంపేస్తాడు. మీనన్‌ చెప్పింది చేయలేక మీ వాళ్లని చంపుకోలేక నువ్వే చనిపోవాలని అనుకున్నావా అంటుంది. జేడీ, కేడీలు మీనన్‌ని వదలమని అనుకుంటారు. జగద్ధాత్రి తండ్రి మీనన్‌తో మమల్ని కిడ్నాప్ చేసినప్పుడే నువ్వు ఎంత మూర్ఖుడివో మాకు అర్థమైంది అని అంటారు. నీకు ఇంత ధైర్యం ఏంటి ఎదురుగా చావు పెట్టుకొని అని మీనన్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: 100 కోట్ల స్కామ్‌లో లక్ష్మీ.. సస్పెండ్ చేసిన విహారి..!