OTT Releases in This Week : ఈవారం ఏకంగా ఒక్కరోజే నాలుగు తెలుగు సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో మూడు సినిమాలు ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా... అందులో రొమాంటిక్, క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి డిఫరెంట్ జానర్ల సినిమాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. జనవరి 10న థియేటర్లలో 'గేమ్ ఛేంజర్' పండగ మొదలైతే, ఓటీటీలో మాత్రం నాలుగు డిఫరెంట్ జానర్ సినిమాలు రిలీజ్ అయ్యి, సంక్రాంతి సంబరాలను మొదలు పెట్టాయి. ఈ లిస్టులో 'బచ్చల మల్లి' నుంచి మొదలు పెడితే.. 'హైడెన్ సీక్', 'మిస్ యూ', 'ప్రేమించొద్దు' లాంటి తెలుగు సినిమాలతో పాటు, 'సీక్రెట్', 'సూక్ష్మదర్శిని' అనే  మలయాళ సినిమా కూడా ఓటీటీలోకి వచ్చింది. 


బచ్చల మల్లి 
అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటించిన రూరల్ బ్యాక్గ్రౌండ్ యాక్షన్ థ్రిల్లర్ 'బచ్చలమల్లి'. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఐఎండీబీలో 9.4 రేటింగ్ దక్కించుకుంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ ఒకేసారి మూడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో జనవరి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఈటీవీ విన్ తో పాటు అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ ఓటీటీలలో అందుబాటులో ఉంది. కానీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రం ఈ సినిమాను చూడాలంటే రెంట్ పే చేయాల్సిందే. 


మిస్ యూ
ఇక ఈవారం థియేటర్లోకి వచ్చిన ఇంట్రెస్టింగ్ సినిమాలలో సిద్ధార్థ్, ఆశికా రంగనాథ్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'మిస్ యూ' ఒకటి. రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో అందుబాటులో ఉండగా, తెలుగు, తమిళ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది. 


హైడ్ అండ్ సీక్ 
తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'హైడ్ అండ్ సీక్'. బసిరెడ్డి రానా దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది సెప్టెంబర్ 20న థియేటర్లలోకి వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ జనపరి 10 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. 


ప్రేమించద్దు 
ప్రేమించద్దు - డోంట్ లవ్ అని క్యాప్షన్ తో టీనేజ్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీకి సిరి శ్రీరామ్ దర్శకత్వం వహిస్తూ, నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీని పాన్ ఇండియా సినిమాగా రూపొందించారు. జనవరి 10 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు బీసీ నెట్ అనే మరో ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. 


సూక్ష్మదర్శిని, సీక్రెట్ 
ఈ సినిమాలతో పాటే 'సూక్ష్మ దర్శిని' అనే బ్లాక్ బస్టర్ మలయాళం మూవీ ఈరోజు నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని హాట్ స్టార్ లో ఐదు భాషల్లో చూడొచ్చు. ఇక తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టిన మరో మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ 'సీక్రెట్'. ఈ మూవీ సన్ నెక్స్ట్ అనే ఓటీటీలో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా మనోరమ మ్యాక్స్ లో కూడా అందుబాటులో ఉంది. అయితే సీక్రెట్ మూవీ మలయాళ భాషల్లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. 



Also Read: 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?