Hrithik Roshan: ప్రస్తుతం ఓటీటీలో సెలబ్రిటీల డాక్యుమెంటరీ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ ఫ్యామిలీకి సంబంధించిన డాక్యుమెంటరీ ఓటీటీలోకి రాబోతోంది. 'ది రోషన్స్' పేరుతో ఈ డాక్యుమెంటరీని రిలీజ్ చేయబోతున్నట్టు నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది. అయితే నేడు హృతిక్ రోషన్ పుట్టినరోజు సందర్భంగా 'ది రోషన్స్' డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ ని ఒకరోజు ముందుగానే రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్.


'ది రోషన్' ట్రైలర్ లో సెలబ్రిటీల హంగామా.... 
హృతిక్ రోషన్ 2000లలో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆయన తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో రూపొందిన 'కహో న ప్యార్ హై' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ మూవీ తోనే ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని అందుకోవడంతో పాటు, ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది 'కహో న ప్యార్ హై'. ఇక ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను హృతిక్ రోషన్ అలరిస్తూ వస్తున్నారు. గ్రీక్ గాడ్ గా కోట్లాది మంది అభిమానుల ఆదరాభిమానాలను అందుకుంటున్న హృతిక్ రోషన్ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు ఆయన కుటుంబ విశేషాల ఆధారంగా 'ది రోషన్స్' అనే డాక్యుమెంటరీని నిర్మిస్తున్నారు. 


భారతీయ చలనచిత పరిశ్రమకు రోషన్ కుటుంబం ఎన్నో సేవలు చేయగా, వారి కుటుంబంలోని మూడు తరాల గురించి ఈ డాక్యుమెంటరీలో చూపించబోతున్నారు. హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్, తాతయ్య రోషన్ సినీ పరిశ్రమకు అందించిన సేవల గురించి ఇందులో ప్రస్తావించబోతున్నారు. హృతిక్ రోషన్ పుట్టినరోజు సందర్భంగా 'ది రోషన్స్' డాక్యుమెంటరీ సిరీస్ ని రిలీజ్ చేశారు. మూడు నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్లో రోషన్ చిత్ర పరిశ్రమ ఫ్రెండ్స్ నుంచి, ఆయన ఫాలోవర్స్ వరకు ప్రతి ఒక్కరి గురించి వెల్లడించారు. అంతేకాకుండా ట్రైలర్లో షారుక్ ఖాన్, అనిల్ కపూర్, సోను నిగమ్, అను కపూర్, సలీం మర్చంట్, సంజయ్ లీలా భన్సాలి తదితరులు హృతిక్ ఫ్యామిలీ గురించి మాట్లాడటం కనిపిస్తోంది. ఇక ఇందులో నాగ్రత్ అనే ఇంటి పేరు నుంచి రోషన్ అనే ఇంటి పేరు ఎలా మారింది ? అనే ఆసక్తికరమైన కథను కూడా చూపించబోతున్నామని వెల్లడించారు. ఈరోజు హృతిక్ రోషన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభిమానులు విషెస్ తెలియజేస్తూ ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ ని వైరల్ చేస్తున్నారు.






డాక్యుమెంటరీని ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?
తాజాగా రిలీజ్ అయిన 'ది రోషన్స్' డాక్యుమెంటరీ ట్రైలర్ లో షారుక్ ఖాన్, అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్, ప్రియాంక చోప్రా, విక్కీ కౌశల్, ప్రీతి జింటా, సంజయ్ లీలా భన్సాలి, రోషన్ కుటుంబానికి సన్నిహితుల ప్రత్యేక సంభాషణలు కూడా ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో జనవరి 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. శశి రంజన్ దీనికి దర్శకత్వం వహించారు. హృతిక్ అభిమానులు ఈ డాక్యుమెంటరీ సిరీస్ రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 


Also Readరామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్... శాటిలైట్ కూడా - రైట్స్ ఎవరు తీసుకున్నారో తెలుసా?