Pani OTT: ప్రముఖ మలయాల నటుడు జోజు జార్జ్ హీరోగా నటించిన మూవీ 'పని'. ఇప్పటికే తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైంది అంటూ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేసింది. తాజాగా మరోసారి ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ మూవీ ట్రైలర్ ని తెలుగుతో పాటు తమిళ, మలయాళం భాషల్లో కూడా తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
'పని' మూవీ ట్రైలర్ హైలెట్స్...
మలయాళంలో స్టార్ హీరోగా దూసుకెళ్తున్న జోజు జార్జ్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ 'పని'. ఈ సినిమాను గత ఏడాది డిసెంబర్ 13న తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీలో జోజు జార్జ్ సరసన అభినయ హీరోయిన్ గా నటించగా, రివేంజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో రూపొందిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా టాక్ తెచ్చుకుంది. తెలుగులో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ ఇతర భాషల్లో మాత్రం ఈ సినిమా అదిరగొట్టింది. ముఖ్యంగా మలయాళంలో నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం కాగా, మరోసారి మేకర్స్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఒకేసారి 'పని' మూవీ ట్రైలర్ ను తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషాల్లో రిలీజ్ చేశారు.
ట్రైలర్లో సినిమా మొత్తం ఒక మర్డర్ చుట్టూ తిరుగుతున్నట్టు చూపించారు. ఇక ఇందులో జోజు జార్జ్ ఒక పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నారు. పోలీసులతో పాటు మరో గ్యాంగ్ ఆయన కోసం తీవ్రంగా వెతకడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోలీసులందరినీ పరుగులు పెట్టించే గిరి అనే గ్యాంగ్ స్టర్ గా జోజు జార్జ్ ఇందులో నటించారు. ఆయన భార్యగా అభినయ నటించింది. ఇక ఈ సినిమా సోనీ లివ్ అనే ఓటీటీలో జనవరి 16 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మోస్ట్ అవైటింగ్ యాక్షన్ రివేంజ్ డ్రామాను చూడాలంటే అప్పటిదాకా ఆగాల్సిందే.
డైరెక్టర్ గా జోజు జార్జ్ ఫస్ట్ మూవీ
ఇప్పటికే మలయాళ సినిమాలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అదరగొడుతున్న జోజు జార్జ్ ఈ సినిమాతో డైరెక్టర్ గా మారారు. సినిమాలో జోజు జార్జ్ టేకింగ్ తో పాటు స్క్రీన్ ప్లే, యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి అని టాక్ నడిచింది. ఇక ఈ హీరో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. గత ఏడాది తెలుగులో వచ్చిన 'ఆదికేశవ' అనే సినిమాలో విలన్ గా నటించాడు జోజు. ఆయనకు తెలుగులో ఇదే మొదటి సినిమా. ఇక ఇప్పుడు 'పని' మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు ప్రేక్షకుల నుంచి ఆశించిన ఆదరణ దక్కలేదు. మరి ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్న 'పని' డిజిటల్ వెర్షన్ కైనా తెలుగు ఆడియన్స్ ఆదరణ దక్కుతుందా ? అనేది ఆసక్తికరంగా మారింది.