SS Rajamouli Confirms Baahubali Animated Series: బాహుబలి ఈజ్ బ్యాక్! మీరు చదివింది అక్షరాలా సత్యం! ప్రేక్షకుల ముందుకు బాహుబలి మళ్లీ వస్తున్నాడు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి స్వయంగా ఈ మాట చెప్పారు. అయితే... మన ముందుకు బాహుబలిగా వచ్చేది రెబల్ స్టార్ ప్రభాస్ కాదు. మరి, బాహుబలిగా ఎవరు వస్తున్నారని ఆలోచనలో పడ్డారా? ఆ అవసరం లేకుండా జక్కన్న ఆన్సర్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే...


బాహుబలి... యానిమేషన్ సిరీస్ రెడీ
Baahubali Animated Series: ''మాహిష్మతి ప్రజలు అతని నామస్మరణలో తరిస్తే, అతని పేరు పలుకుతుంటే... అతడి రాకను అడ్డుకోవడం ఈ విశ్వంలో ఏ శక్తికీ వల్ల కాదు'' అని రాజమౌళి ట్వీట్ చేశారు. 


'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్' పేరుతో యానిమేటెడ్ సిరీస్ రూపొందించినట్లు ఎస్ఎస్ రాజమౌళి సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా తెలిపారు. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు.


Also Read: నందితా శ్వేతా సైడ్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అయినట్టేనా? స్టార్ అవ్వాల్సిన హీరోయిన్‌కు ఎందుకీ దుస్థితి?






భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త రికార్డులు లిఖించిన చరిత్ర మన 'బాహుబలి' సొంతం. ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల దగ్గర 2000 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించిన తొలి సినిమా కూడా 'బాహుబలి' అని చెప్పడంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు.



మరి, 'బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్' సిరీస్ దర్శకులు ఎవరు? ఏ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాలు ఇంకా వెల్లడించలేదు. బహుశా... ట్రైలర్ విడుదల చేసినప్పుడు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. 'బాహుబలి' తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆదరణ లభించింది. అందువల్ల, 'బాహుబలి' యానిమేటెడ్ సిరీస్ మీద ఇంటర్నేషనల్ ఆడియన్స్ చూపు పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. 



బాహుబలి విడుదలైన తర్వాత దానికి ప్రీక్వెల్ (Baahubali Prequel)గా సిరీస్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ భారీ ఎత్తున ఆ సిరీస్ నిర్మించడానికి ముందుకు వచ్చింది. దేవా కట్టా, ప్రవీణ్ సత్తారు దర్శకులుగా 'బాహుబలి: బిఫోర్ బిగినింగ్' పేరుతో చిత్రీకరణ సైతం ప్రారంభించారు. అయితే ఆ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయింది. ఎందుకు? ఏమిటి? వంటి వివరాలను ఎవరూ వెల్లడించలేదు. తాము చేసిన స్క్రిప్ట్ వర్క్, షూటింగ్ చేసినా ఫుటేజ్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీకి ఇచ్చామని ఆ మధ్య ఓసారి దేవా కట్టా తెలిపారు.


Also Readతెలుగు పాటకు తొలి నేషనల్ అవార్డు తెచ్చిన కవి... విప్లవ స్ఫూర్తికి చిరునామా శ్రీశ్రీ జీవితంలో 10 ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్!